Site icon HashtagU Telugu

Delhi :కేంద్ర సమాచారశాఖ సంచలన నిర్ణయం…రాష్ట్ర ప్రభుత్వాలు టీవీ ఛానెళ్లు నిర్వహించకూడదు..!!

Tv Channels

Tv Channels

కేంద్ర ప్రసార మంత్రిత్వ శాఖ సంచలన నిర్ణయం తీసుకుంది. అన్ని కేంద్ర మంత్రిత్వ శాఖలు, రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు నిర్వహిస్తున్న ప్రసార కార్యకలాపాలను వెంటనే నిలిపివేయాలని కేంద్రం ఆదేశించింది. తమ కంటెంట్‌ను ప్రసారం చేసే వారు ప్రసార భారతిని ఉపయోగించాలని సూచించింది. వచ్చే ఏడాది డిసెంబర్ 31 నాటికి ప్రసార పంపిణీ కార్యకలాపా లనుంచి వైదొలగాలని పేర్కొంది. డిసెంబర్ 31, 2023నాటికి ఈ ప్రక్రియను పూర్తి చేయాలని ఆదేశించింది.

శుక్రవారం జారీ చేసిన సలహాలో, భవిష్యత్తులో ఏ మంత్రిత్వ శాఖ లేదా కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర లేదా కేంద్ర పాలిత ప్రభుత్వం వాటి అనుబంధ సంస్థలు ప్రసార కార్యకలాపాలు ప్రసారం పంపిణీలోకి ప్రవేశించకూడదని తేల్చి చెప్పింది. ఇప్పటికే తమ కంటెంట్‌ను ప్రసారం చేస్తుంటే, అది పబ్లిక్ బ్రాడ్‌కాస్టర్ ద్వారా మాత్రమే చేయాలని ఆదేశాలు జారీ చేసింది. తెలంగాణ, కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు తమ సొంత విద్యా చానళ్లను నడుపుతున్నాయి. ఈ నోటీసుల వల్ల ప్రభుత్వయాజమాన్యంలోని టీవీ ఛానెల్స్ భవిష్యత్తుపై ప్రశ్నలను లేవనెత్తుతోంది.