Amit Shah : కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా శుక్రవారం ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులతో శుక్రవారం మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన సీఎంలకు కీలక ఆదేశాలు జారీ చేశారు. పాకిస్తాన్ దేశస్తులను గుర్తించి వెనక్కి పంపాలని ఆదేశించారు. తొలుత స్థానికంగా ఉంటున్న పాకిస్థానీయులను గుర్తించి ఆ సమాచారం కేంద్రానికి పంపించాలని కోరారు. అప్పుడే వారి వీసాల రద్దుకు అవకాశం ఉంటుందన్నారు. గతంలో భారత్ సార్క్ వీసా పొడిగింపు పథకం కింద చాలా మంది పాక్ జాతీయులకు భారత్‌లో పర్యటించే అవకాశాలను కల్పించారు. ఈ ప్రోగ్రామ్ కింద భారత్‌లో ఉన్న ఎవరైనా సరే 48 గంటల్లో దేశాన్ని వీడాలని కేంద్రం ఆదేశాలు జారీ చేసింది.
Read Also:Pahalgam Terror Attack : భారత్, పాకిస్థాన్‌లు సంయమనం పాటించాలి : ఐక్యారాజ్యసమితి
ఇప్పటిక పాకిస్తానీయుల వీసాలను రద్దు చేసిన విషయం తెలిసిందే. కాగా హైదరబాద్ లో 208మంది పాకిస్తానీయులు ఉన్నట్టు గుర్తించారు. హైదరాబాద్ ఎస్ బీ లో 208 పాకిస్తాన్ పౌరులు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. వారందరూ ఇప్పుడు ఎక్కడ ఉన్నారని ఆరా తీస్తున్నారు. ఇక, దీంతోపాటు పాక్‌లో ఉన్న భారత జాతీయులు తిరిగి వచ్చేయాలని అడ్వైజరీ జారీ చేసింది. అదే సమయంలో ఇక్కడ పాక్ జాతీయులు గడువు ముగిసేలోపు దేశం విడిచి వెళ్లిపోవాలని కేంద్రం హెచ్చరించింది. మెడికల్ వీసాలు పొందిన వారికి మాత్రం ఏప్రిల్ 29వ తేదీ వరకు అవకాశం ఉంది. ఇక పాక్ నుంచి కొత్త దరఖాస్తుదారులకు వీసా సర్వీసులను తక్షణమే నిలిపివేశామని విదేశాంగ శాఖ పేర్కొంది.
కాగా, పహల్గాంలో దాడికి పాల్పడిన ముష్కరుల కోసం భారత దళాలు జమ్మూ కాశ్మీర్‌ను అణువణువునా శోధిస్తున్నారు. ఈ దాడి వెనక పాక్ ప్రమేయం ఉన్నట్లు గుర్తించిన భారత ప్రభుత్వం దాయాది దేశంతో పూర్తిగా దౌత్య సంబంధాలు తెంచుకుకుంది. ఇందులో భాగంగానే పాక్ పౌరులకు జారీ చేసిన అన్ని రకాల వీసాలను రద్దు చేసి.. వారం రోజుల్లోగా దేశం విడిచి వెళ్లాలని ఆదేశించింది.
Read Also: Gavaskar : ఇండియాలో ఇంచు భూమిని కూడా కదిలించలేరు – పాక్ కు గావస్కర్ వార్నింగ్