Site icon HashtagU Telugu

Infosys : ఇన్ఫోసిస్ భారీ ప‌త‌నం

Stock Market

Stock Market Down

ఇటీవ‌ల లాభాల‌తో దూసుకుపోయిన ఇన్ఫోసిస్ షేర్ భారీగా ప‌త‌నం అయింది. ఐటీ, టెక్, బ్యాంకింగ్ స్టాకులు తీవ్రమైన అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొన్నాయి. ఫ‌లితంగా దేశీ స్టాక్ మార్కెట్ లోని ప‌లు కంపెనీల షేర్లు పతనమయ్యాయి. ఉక్రెయిన్ పై రష్యా చేస్తున్న యుద్ధం కార‌ణంగా ద్రవ్యోల్బణం పెరుగుతోందన్న భయాలు ఇన్వెస్టర్ల సెంటిమెంటును దెబ్బతీశాయి. సోమ‌వారం రోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 1,172 పాయింట్లు నష్టపోయి 57,166 కి పడిపోయింది. నిఫ్టీ 302 పాయింట్లు కోల్పోయి 17,173కి దిగజారింది. ఐటీ, టెక్ సూచీలు 4 శాతానికి పైగా నష్టపోయాయి.
బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
ఎన్టీపీసీ (6.11%), టాటా స్టీల్ (1.51%), మారుతి (1.37%), టైటాన్ (1.21%), హిందుస్థాన్ యూనిలీవర్ (1.13%).
టాప్ లూజర్స్:
ఇన్ఫోసిస్ (-7.27%), హెచ్డీఎఫ్సీ (-4.81%), హెచ్డీఎఫ్సీ బ్యాంక్ (-4.74%), టెక్ మహీంద్రా (-4.69%), విప్రో (-3.67%).

Exit mobile version