Site icon HashtagU Telugu

Delhi CM : ఢిల్లీ సీఎం రేసులో స్మృతీ ఇరానీ, బన్సూరీ స్వరాజ్‌.. ఎవరికో ఛాన్స్ ?

Delhi Cm Bjp Smriti Irani Bansuri Swaraj

Delhi CM : ఢిల్లీకి కాబోయే సీఎం ఎవరు ?  అనే దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. మొత్తం మీద ఈసారి సీఎంతో పాటు రెండు డిప్యూటీ సీఎం పోస్టులను అదనంగా బీజేపీ క్రియేట్ చేయబోతోంది. సీనియర్లు, పాలనా వ్యవహారాలపై అవగాహన ఉన్న నేతలకు ఈ మూడు పదవులను కట్టబెట్టాలని కమలదళం పెద్దలు భావిస్తున్నారు.  వీటిని ఎవరికి కేటాయించాలి అనే దానిపై ఆదివారం (ఫిబ్రవరి 16)లోగా కీలక ప్రకటన చేయనున్నారు.

Also Read :Bird Flu Chickens: చేపలకు మేతగా బర్డ్‌ఫ్లూ కోళ్లు.. మనిషికీ సోకిన ఆ వైరస్

సీఎం రేసులో కొత్త ముఖాలు

సీఎం పోస్టు కోసం పోటీపడుతున్న బీజేపీ నేతల్లో ఎమ్మెల్యేలు పర్వేశ్ సింగ్ వర్మ, సతీశ్‌ ఉపాధ్యాయ్‌, విజయేందర్‌ గుప్తా, ఆశిష్‌ సూద్‌, పవన్‌ శర్మ, ఈస్ట్ ఢిల్లీ ఎంపీ హర్ష మల్హోత్రా, ఈశాన్య ఢిల్లీ ఎంపీ మనోజ్ తివారీ, న్యూఢిల్లీ ఎంపీ బన్సూరీ స్వరాజ్‌లు ఉన్నారు. పూర్వాంచల్‌ నేపథ్యం కలిగిన ఎమ్మెల్యే, సిక్కు లేదా మహిళను  సీఎం(Delhi CM) చేయాలని బీజేపీ పెద్దలు భావిస్తున్నారట. మాజీ కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ పేరును కూడా సీఎం పోస్టు కోసం పరిశీలిస్తున్నారనే టాక్ వినిపిస్తోంది. చివరి నిమిషంలో ఎవరికి ఈ కీలక అవకాశాన్ని అప్పగిస్తారనేది ఎవరూ అంచనా వేయలేకపోతున్నారు.

Also Read :Rs 6000 Crore Dump: ఈ చెత్తకుప్పలో రూ.6,500 కోట్ల బిట్‌కాయిన్లు.. కొనేందుకు టెకీ రెడీ

వచ్చే ఆదివారం కీలక భేటీ

వచ్చే ఆదివారం (ఫిబ్రవరి 16) రోజు ఢిల్లీలో బీజేపీ శాసనసభా పక్ష నేతల సమావేశం జరుగుతుంది. ఇందులో పార్టీ జాతీయ నాయకత్వం నుంచి ఇద్దరు సీనియర్‌ నేతలు హాజరవుతారు. ఈ మీటింగులోనే తదుపరి సీఎంను ఎంపిక చేస్తారని తెలుస్తోంది. ఉప ముఖ్యమంత్రి పోస్టు కోసం ఇద్దరి పేర్లను ప్రకటిస్తారు. సామాజిక సమీకరణాలకు అనుగుణంగా ఈ మూడు పోస్టులకు నేతలను ఎంపిక చేస్తారు.