Mohan Bhagwat: కేంద్ర హోం మంత్రిత్వ శాఖ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ చీఫ్ మోహన్ భగవత్ భద్రతను పెంచింది. ప్రస్తుతం ఉన్న జడ్ ప్లస్ (Z+) కేటగిరి భద్రతను అడ్వాన్స్‌డ్ సెక్యూరిటీ లైజన్ (ASL)కు పెంచింది. దీంతో కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో సమానమైన భద్రత మోహన్ భగవత్‌కు లభిస్తుంది. భద్రతకు ముప్పు తలెత్తే అవకాశాలపై ఇంటెలిజెన్స్ బ్యూరో ఇచ్చిన తాజా నివేదక ప్రకారం మోహన్ భగవత్‌కు భద్రత పెంచాలని ఆగస్టు 16న తాజా ఆదేశాలు జారీ అయినట్టు అధికార వర్గాలు తెలిపాయి.
We’re now on WhatsApp. Click to Join.
గతంలో మోహన్ భగవత్ కొన్ని సెన్సిటివ్ ప్రాంతాల్లో పర్యటించినప్పుడు ఏఎస్ఎల్ ప్రోటోకాల్ కల్పించేవారు. ఇటీవల కొన్ని చోట్ల, ముఖ్యంగా బీజేపీయేతర రాష్ట్రాల్లో భగవత్ భద్రతలో అలసత్యా్న్ని ఇంటిలిజెన్స్ గమనించింది. రాడికల్ ఇస్లామిస్ట్ గ్రూపులతో సహా వివిధ సంస్థల నుంచి ఆయనకు ముప్పు పెరిగినట్టు అంచనా వేసింది. ఈ నేపథ్యంలో భగవత్‌కు ఏఎస్ఎస్ ప్రోటోకాల్ భద్రత కల్పించాలని హోం మంత్రిత్వ శాఖ నిర్ణయించింది. ఏఎస్ఎల్ భద్రత ప్రకారం జిల్లా యంత్రాంగం, పోలీలు, ఆరోగ్యం, ఇతర శాఖలు వంటి స్థానిక సంస్థలు సమష్టిగా భద్రత కల్పించాల్సి ఉంటుంది. భగవత్ ఏదైనా కార్యక్రమానికి వెళ్లాల్సి ఉంటే ముందుగానే ఒక బృందం సంఘటనా స్థలాన్ని పరిశీలించి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన తర్వాతే అక్కడికి వెళ్లేందుకు అనుమతిస్తారు.
ASL భద్రత అంటే ఏమిటి?..
ASL ప్రకారం, ప్రధానమంత్రి,హోంమంత్రికి మాత్రమే భద్రత ఇవ్వబడుతుంది. ఈ రక్షణ కింద, కేంద్ర ఏజెన్సీలు, భద్రతా బలగాలు కాకుండా, ఈ స్థాయి రక్షణ పొందుతున్న వ్యక్తి భద్రతకు సంబంధించిన జిల్లా పరిపాలన, పోలీసు, ఆరోగ్యం, ఇతర విభాగాలు వంటి స్థానిక సంస్థల భాగస్వామ్యం తప్పనిసరి. ఇందులో బహుళ-లేయర్డ్ సెక్యూరిటీ కవర్‌తో కూడిన విధ్వంస నిరోధక తనిఖీలు ఉన్నాయి. సూచించిన ప్రోటోకాల్స్ ప్రకారం ప్రత్యేకంగా రూపొందించిన హెలికాప్టర్లలో మాత్రమే హెలికాప్టర్ ప్రయాణానికి అనుమతి ఉంది.