Ahmedabad: ప్రధాని మోదీ ర్యాలీలో భద్రతా లోపం.ఫ్లెయింగ్ జోన్ లో డ్రోన్ ఎగరవేడయంతో ముగ్గురిపై ఎఫ్ఐఆర్ నమోదు..!!

  • Written By:
  • Publish Date - November 25, 2022 / 06:42 AM IST

గుజరాత్ ఎన్నికల నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో గురువారం అహ్మదాబాద్ లో ప్రధానమంత్రి ఎన్నికల ర్యాలీ జరిగింది. ఆ ర్యాలీలో భద్రతా లోపం కనిపించింది. ప్రైవేట్ డ్రోన్ ఎగరవేసి ఉదంతం తెరపైకి వచ్చింది. దీనికి కారణమైన ముగ్గురిపై ఎఫ్ఐఆర్ నమోదు చేయడంతోపాటు వారిని అరెస్టు చేశారు.

అహ్మదాబాద్ జిల్లాలోని బావ్లా గ్రామంలో మోదీ ర్యాలీ జరిగే వేదిక సమీపంలో కెమెరా అమర్చిన డ్రోన్ను ఎగురవేసినట్లుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. గుజరాత్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధానమంత్రి మోదీ ప్రసంగించారు. భద్రతా కారణాల ద్రుష్ట్యా వేదిక దగ్గర డ్రోన్స్ ఎగురవేడయం నిషేధించారు. అయితే ర్యాలీకి ముందు అక్కడికి చేరిన వారిని ద్రుశ్యాలను తీయడానికి రిమోట్ నియంత్రిత డ్రోన్ను ఉపయోగిస్తున్న కొంతమందిని పోలీసులు గుర్తించారు. ఈ ముగ్గురు స్థానికులు..తమ వ్యక్తిగతంగా ప్రచార ర్యాలీ కోసం వచ్చిన జనాలను విజువల్స్ ను రికార్డు చేస్తున్నారు. అయితే ఆ ప్రాంతంలో డ్రోన్ ఎగురవేత నిసేధం. నిబంధనలకు విరుద్ధంగా డ్రోన్ ఎగురవేశారంటూ వారిపై ఐపీసీ సెక్షన్ 188 కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.