Oracle : భార‌త్ లో లంచాల కోసం ఒరాకిల్ కోట్ల రూపాయ‌ల కేటాయింపు

భార‌త దేశంలో లంచాలు ఇచ్చేందుకు ప్ర‌ముఖ ఐటీ సంస్థ ఒరాకిల్ నిధుల‌ను కేటాయించింది.

  • Written By:
  • Publish Date - September 28, 2022 / 05:40 PM IST

భార‌త దేశంలో లంచాలు ఇచ్చేందుకు ప్ర‌ముఖ ఐటీ సంస్థ ఒరాకిల్ నిధుల‌ను కేటాయించింది. ఇండియా, ట‌ర్కీ, యూఏఈ దేశాల‌కు చెందిన కొంద‌రికి లంచాలు ఇచ్చేందుకు 3.30 లక్షల డాలర్ల మేర నిధులు కేటాయించినట్టు అమెరికా స్టాక్ ఎక్జేంజ్ ఆరోపిస్తోంది. ఇది విదేశీ అవినీతి కార్యకలాపాల చట్టం (ఎఫ్ సీపీఏ) ఉల్లంఘన అవుతుందని స్పష్టం చేసింది.

ముఖ్యంగా, ఒరాకిల్ ఇండియా విభాగం రైల్వే శాఖ ఆధ్వర్యంలోని ఓ రవాణా సంస్థకు భారీ రాయితీ ఇచ్చినట్టు ఎస్ఈసీ వెల్లడించింది. ఓ సాఫ్ట్ వేర్ కాంపోనెంట్ విషయంలో తీవ్ర పోటీ ఉన్నందున ఒప్పందం జారిపోకుండా ఉండేందుకు ఈ రాయితీ ఇవ్వాల్సి వస్తోందని సేల్స్ సిబ్బంది ఒరాకిల్ ఉన్నతాధికారులకు తెలియజేయగా, అందుకు వారు వెంటనే అనుమతి ఇచ్చిన విషయంపై ఆధారాలు సేకరించింది.

భారత కేంద్ర ప్రభుత్వానికి చెందిన ప్రొక్యూర్ మెంట్ వెబ్ సైట్ ఈ కాంట్రాక్టు విషయంలో ఒరాకిల్ ఇండియా విభాగానికి ఎలాంటి పోటీ లేదని స్పష్టంగా చెప్పడాన్ని కూడా ఎస్ఈసీ ఆధారంగా చూపుతోంది. భారత్ లోని ఓ ఉద్యోగికి చెల్లించేందుకు 67 వేల డాలర్ల మొత్తం కేటాయించినట్టు రికార్డుల ద్వారా గుర్తించింది.

ఇదే విధంగా ఒరాకిల్ టుర్కియే (టర్కీ), యూఏఈ దేశాల్లోనూ ఉల్లంఘనలకు పాల్పడినట్టు నివేదికలో వెల్లడించింది. ఈ నేపథ్యంలోనే ఒరాకిల్ కు రూ.188 కోట్ల జరిమానా వడ్డించింది. ఒరాకిల్ పై ఎస్ఈసీ కన్నెర్ర చేయడం ఇదే తొలిసారి కాదు. పదేళ్ల కిందట కూడా ఒరాకిల్ ఇండియా విభాగంపై ఆరోపణలు రాగా, ఎస్ఈసీ రూ.16 కోట్ల జరిమానా వడ్డించింది.

లావాదేవీలో పాల్గొన్న సేల్స్ ఉద్యోగులలో ఒకరు నిర్దిష్ట భారతీయ SOE అధికారికి చెల్లింపులు చేయడానికి అందుబాటులో ఉన్న “బఫర్” $67,000 అని సూచించే స్ప్రెడ్‌షీట్‌ను నిర్వహించారు. SOE అధికారులకు చెల్లించినందుకు పేరుగాంచిన సంస్థకు సుమారుగా $330,000 అందించబడింది మరియు లావాదేవీలో పాల్గొన్న సేల్స్ ఉద్యోగులచే నియంత్రించబడే ఒకరికి మరో $62,000 చెల్లించబడింది.