Seat Belt : బస్సులు, భారీ వాహనాల్లోనూ సీట్‌ బెల్ట్‌ మస్ట్.. ఎందుకు ?

Seat Belt : మనదేశంలో కార్లలో ప్రయాణించే వారి భద్రత కోసం సీట్ బెల్టులు ధరించడాన్ని తప్పనిసరి చేశారు.

  • Written By:
  • Updated On - February 25, 2024 / 08:36 AM IST

Seat Belt : మనదేశంలో కార్లలో ప్రయాణించే వారి భద్రత కోసం సీట్ బెల్టులు ధరించడాన్ని తప్పనిసరి చేశారు. అయితే బస్సులు, లారీలతో పాటు ఇతర భారీ వాహనాల్లో మాత్రం సీట్ బెల్ట్  ధరించే నిబంధన అమలు కావడం లేదు. దీంతో నిత్యం రోడ్డు ప్రమాదాల బారిన పడుతున్న వారి సంఖ్య ఎక్కువగానే ఉంటోంది. దీనికి సమాధానంగా త్వరలోనే బస్సులు, లారీల వంటి భారీ వాహనాల్లోనూ సీటు బెల్ట్ వాడకాన్ని తీసుకురానున్నారు. భారీ వాహనాల్లో రాకపోకలు సాగించే డ్రైవర్లతో పాటు ఇతర ప్రయాణికులు సీట్ బెల్ట్ (Seat Belt) ధరించకపోవడంతో మృత్యువాత పడుతున్నారు. దీన్ని అరికట్టేందుకు బస్సులతో పాటు భారీ వాహనాల్లోనూ సీట్ బెల్ట్ వాడకం తప్పనిసరి చేయాలని అంతర్జాతీయ రహదారి సమాఖ్య (IRF) కేంద్ర ప్రభుత్వానికి సూచించింది. సీటు బెల్టును ధరించక పోవడంతో స్కూలు బస్సుల్లో ప్రయాణించే విద్యార్థులు మృత్యువాత పడిన సందర్భాలు కూడా ఉన్నాయని అంతర్జాతీయ రహదారి సమాఖ్య పేర్కొంది. ఈమేరకు కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వశాఖకు IRF ఒక లేఖ రాసింది. ఇప్పటికైనా బస్సులతో పాటు ఇతర భారీ వాహనాల్లో సీట్ బెల్ట్ ల వాడకాన్ని తప్పనిసరి చేయాలని ప్రభుత్వాన్ని కోరింది. దీనిపై కేంద్రం త్వరలోనే నిర్ణయం తీసుకోనుందని తెలుస్తోంది.

We’re now on WhatsApp. Click to Join

IRF చెప్పిన వాస్తవాలు

  • నేషనల్ హైవే ట్రాఫిక్ సేఫ్టీ అడ్మినిస్ట్రేషన్ 2021 నివేదిక ప్రకారం.. అమెరికాలో బస్సు ప్రమాదాల కారణంగా 14 మందే ప్రాణాలు కోల్పోయారు.
  • 2022 సంవత్సరంలో చైనాలో బస్సు ప్రమాదాల్లో 215 మరణించారు.
  • ప్రజా రవాణా విషయంలో ఆయా దేశాలు అవలంబిస్తున్న విధానాల వల్లే బస్సు ప్రమాద మరణాలు తేడాలు ఉన్నాయని అంతర్జాతీయ రహదారి సమాఖ్య చెప్పింది.
  • కఠినమైన భద్రతా ప్రమాణాలను పాటిస్తూ అభివృద్ధి చెందుతున్న, అభివృద్ధి చెందిన దేశాలు అద్భుతమైన ఫలితాలను సాధించాయని పేర్కొంది.
  • డ్రైవింగ్‌, సీట్‌ బెల్ట్‌ లేకుండా ప్రయాణించడం వంటి ప్రధాన కారణాలతో రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటివరకు పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు ప్రమాదాల్లో మృత్యువాత పడ్డారు.
  • శుక్రవారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన కంటోన్మెంట్‌ ఎమ్మెల్యే లాస్య నందిత(37) సైతం సీట్‌ బెల్ట్‌ పెట్టుకోలేదు.

Also Read : YS Sharmila : షర్మిల కుమారుడి మ్యారేజ్ రిసెప్షన్.. హాజరైన ప్రముఖులు వీరే

16,715 మంది..

నేషనల్‌ క్రైమ్‌ రికార్డ్స్‌ బ్యూరో 2023లో విడుదల చేసిన లెక్కల ప్రకారం 2022లో 461312 రోడ్డు ప్రమాదాలు జరగగా.. 1,68,491 మంది మృతి చెందారు. చనిపోయిన వారిలో 16715 మంది సీట్‌ బెల్ట్‌ ధరించలేదు.

ప్రముఖుల మరణాలు..

  • గత ఏడాది ఏపీలో ఎమ్మెల్సీ షేక్‌ సాబ్జీ వెస్ట్‌గోదావరి జిల్లా ఉండి మండలంలో రోడ్డు ప్రమాదంలో చనిపోయారు. ఆయన సీట్‌ బెల్ట్‌ పెట్టుకోలేదని తేలింది.
  • 2022లో టాటా సంస్థ మాజీ చైర్మన్‌ సైరస్‌ మిస్త్రీ అహ్మదాబాద్‌, ముంబై హైవేపై జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. ఖరీదైన కారులో వెళ్లినా.. సీట్‌ బెల్ట్‌ పెట్టుకోకపోవడంతో ప్రాణాలు కోల్పోయారు.
  • 2014లో నందమూరి జానకీరామ్‌, 2018లో ఆయన తండ్రి టీడీపీ నాయకులు హరికృష్ణ రోడ్డు ప్రమాదాల్లో చనిపోయారు. ఆ సమయంలో వారు సీటు బెల్టు ధరించలేదు.
  • నాయకుడు ఇంద్రారెడ్డి, ప్రస్తుత మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి కొడుకు ప్రతీక్‌రెడ్డి, ఎర్రం నాయుడు, లాల్‌జాన్‌ పాషా, శోభనాగిరెడ్డి రోడ్డు ప్రమాదాల్లో మృత్యువాత పడ్డారు. అతివేగం, నిర్లక్ష్యపు డ్రైవింగ్‌, సీట్‌ బెల్ట్‌ ధరించకపోవడంతోనే వీరు చనిపోయారు.

Also Read : Meow Meow Drugs: మియావ్ మియావ్ డ్రగ్స్ అంటే ఏమిటి..?