Accident: తమిళనాడు రాష్ట్రంలో మరోసారి గేట్ కీపర్ నిర్లక్ష్యం భయానక ప్రమాదానికి దారితీసింది. కడలూరు జిల్లా సెమ్మన్ కుప్పం వద్ద మంగళవారం ఉదయం ఒక స్కూల్ వ్యాన్ రైల్వే ట్రాక్ దాటే ప్రయత్నంలో ఉండగా, అకస్మాత్తుగా వచ్చిన రైలు ఢీకొట్టింది. ఈ ఘటనలో ముగ్గురు విద్యార్థులు అక్కడికక్కడే మృతిచెందగా, మరో ముగ్గురు విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.
ప్రాధమికంగా అందిన సమాచారం ప్రకారం, ప్రమాదం జరిగిన సమయంలో రైల్వే గేటు తెరిచి ఉండటం, గేట్ కీపర్ తన బాధ్యతల్లో నిదానంగా వ్యవహరించటం ఈ విషాదానికి ప్రధాన కారణంగా అధికారులు గుర్తించారు. ప్రమాద సమయంలో గేట్ కీపర్ నిద్రలో ఉన్నట్టు తెలుస్తోంది. ట్రైన్ వచ్చిన సమాచారం ఉన్నా గేట్ మూయకపోవడంతో స్కూల్ వ్యాన్ పట్టాలు దాటడానికి ప్రయత్నించగా ఈ ఘటనా చోటుచేసుకుంది.
రైలు వ్యాన్‌ను దాదాపు వంద మీటర్లు ఈడ్చుకెళ్లినట్టు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. ఈ దృశ్యాలను చూసిన స్థానికులు తీవ్రంగా స్పందించి గేట్ కీపర్‌పై భౌతిక దాడికి పాల్పడ్డారు. అధికారులు ఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు ప్రారంభించారు. బాధితుల కుటుంబాలు విషాదంలో మునిగిపోతుండగా, విద్యార్థుల చనిపోయిన వార్త విని ఆ ప్రాంతమంతా కన్నీటిలో మునిగిపోయింది.
ఈ సంఘటనపై రైల్వే శాఖ స్పందిస్తూ పూర్తి స్థాయి విచారణకు ఆదేశించిందని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది. మరోసారి నిర్లక్ష్యం ఓ విలువైన ప్రాణాన్ని తీసుకెళ్లిన ఈ ఘటన, రైల్వే భద్రతా విధానాలపై తీవ్రంగా ప్రశ్నలు వేస్తోంది.
Hidma : ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టుల తుదెత్తు.. హిడ్మా, దేవా ముప్పు ముగుస్తుందా..?