Site icon HashtagU Telugu

School Bus Accident:ఉత్తరాఖండ్ లో స్కూల్ బస్సు బోల్తా…ఇద్దరు విద్యార్థులు మృతి ..!!

School Bus

School Bus

ఉత్తరాఖండ్ లో ఘోర ప్రమాదం జరిగింది. సితార్ గంజ్ లో స్కూల్ బస్సు బోల్తా పడింది. ఈ ఘటనలో ఇద్దరు విద్యార్థులు మరణించారు. పలువురు విద్యార్థులు గాయపడినట్లు సమాచారం. ఈ ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 56మంది విద్యార్థులు ఉన్నారు. ఆరుగురు ఉపాధ్యాయులు ఉన్నారు. ఎలా బోల్తాపడిందన్న విషయంపై ఇంకా పూర్తి సమాచారం తెలియలేదు. గాయపడిన వారిని చికిత్స కోసం సమీప ఆసుపత్రికి తరలించారు.

ఈ ప్రమాదంపై సీఎం పుష్కర్ సింగ్ ధామి ట్వీట్ చేశారు. నయాగావ్ భట్టే లోని కిచ్చా లోని వెద్రమ్ స్కూల్ బస్సు ప్రమాదంపై విచారకరమైన వార్త అందింది. ఈ ప్రమాదం ఇద్దరు విద్యార్థులు మరణించారు. పలువురు విద్యార్థులకు గాయాలయ్యాయి. అత్యంత బాధాకరమైన సమాచారం. క్షతగాత్రులందరినీ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు ట్వీట్ చేశారు.

ప్రమాదం జరిగిన వెంటనే అక్కడ గందరగోళ వాతావరణ: నెలకొందని స్థానికులు తెలిపారు. రక్తం మడుగులో ఉన్న విద్యార్థులను ఆసుపత్రికి తరలించినట్లు చెప్పారు. పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.