Site icon HashtagU Telugu

Supreme Court : ఉచిత హామీలపై సుప్రీం కోర్ట్ షాక్..ఆ రెండు రాష్ట్రాలకు నోటీసులు

Supreme Court

ఎన్నికలు (Elections ) వస్తున్నాయంటే చాలు.. ఓటర్లను మభ్య పెట్టేందుకు రాజకీయ పార్టీలు ఉచిత హామీలు కురిపిస్తుంటాయి. అవేమి వారి జేబులో నుండి ఇస్తుందేం కాదు ప్రజల ఫై పన్నుల భారం మోపి..ఆ పన్నుల రూపంలో వచ్చిన డబ్బును మళ్లీ ప్రజలకే ఉచిత హామీల పేరిట ఇస్తుంటారు. తాజాగా దీనిపై సుప్రీం కోర్ట్ (Supreme Court) లో పిల్ దాఖ‌లైంది. దానిపై విచార‌ణ చేప‌ట్టిన సుప్రీం కోర్టు.. కేంద్రంతో పాటు మ‌ధ్య‌ప్ర‌దేశ్‌, రాజ‌స్తాన్ రాష్ట్రాల‌కు నోటీసు ఇచ్చింది.

We’re now on WhatsApp. Click to Join.

ఎన్నిక‌ల‌కు ముందు మధ్య ప్రదేశ్ , రాజస్థాన్ ప్ర‌భుత్వాలు (Madhya Pradesh and Rajasthan Governments) ఓట‌ర్ల‌కు డ‌బ్బును పంపిణీ చేయ‌డం దారుణ‌మ‌ని, ఎన్నిక‌ల వేళ ప్ర‌తిసారి ఇదే జ‌రుగుతోంద‌ని, ప‌న్నుదారుల‌పై ఆ భారం ప‌డుతుంద‌ని పిల్ త‌ర‌పున న్యాయ‌వాది భ‌ట్టూలాల్ (Bhattulal) జైన్ సుప్రీంలో పిల్ దాఖ‌లు చేశారు. చీఫ్ జ‌స్టిస్ డీవై చంద్ర‌చూడ్, జ‌స్టిస్ జేబీ ప‌ర్దివాలా(Pardiwala), జ‌స్టిస్ మిశ్రాల‌తో కూడిన ధ‌ర్మాస‌నం ఆ పిల్‌ను విచారించింది. విచారణ అనంతరం కేంద్ర ప్ర‌భుత్వంతో పాటు మ‌ధ్య‌ప్ర‌దేశ్‌, రాజ‌స్థాన్ రాష్ట్ర ప్ర‌భుత్వాల‌కు సుప్రీం నోటీసులు ఇచ్చింది. అలాగే ఎన్నిక‌ల సంఘం, రిజ‌ర్వ్ బ్యాంక్‌కు కూడా కోర్టు నోటీసులు జారీ చేసింది.

మ‌ళ్లీ నాలుగు వారాల్లో ఈ కేసుపై విచార‌ణ చేప‌ట్ట‌నున్నారు.కేంద్ర ప్ర‌భుత్వం త‌ర‌పున సొలిసిట‌ర్ జ‌న‌ర‌ల్ తుషార్ మెహ‌తా (Tusshar Mehta) వాదనలు వినిపిస్తూ రాజ‌కీయ పార్టీల ఉచిత హామీలు ఆర్థిక విధ్వంసానికి దారి తీస్తోంద‌ని తెలిపారు.

Read Also : Sachin Tendulkar: వరల్డ్ కప్ లో ఆ నాలుగే జట్లు సెమీస్ కు వెళ్తాయి: సచిన్ టెండూల్కర్