Site icon HashtagU Telugu

Supreme Court: ఎన్నికల బాండ్ల కేసు.. ఎస్‌బీఐకి సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు

111

Electoral bond case: SC orders SBI to disclose all details

 

 

Electoral Bonds: ఎన్నికల బాండ్ల(electoral bonds) వ్యవహారంలో సుప్రీంకోర్టు(Supreme Court) మరోమారు కీలక ఆదేశాలు జారీచేసింది. ఆయా రాజకీయ పార్టీలకు వ్యక్తులు, కంపెనీలు విరాళాలు ఇచ్చేందుకు అనుమతించిన ఎలక్టోరల్ బాండ్లకు సంబంధించిన వివరాలన్నింటినీ తప్పనిసరిగా వెల్లడించాల్సిందేనని భారతీయ స్టేట్‌బ్యాంకు (ఎస్‌బీఐ)(sbi)ను ఆదేశించింది. అంతేకాదు, ప్రతి బాండ్ క్రమసంఖ్య కూడా అందులో పేర్కొనాల్సిందేనంటూ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్(Chief Justice is Justice DY Chandrachud) నేతృత్వంలోని ఐదుగురు న్యాయమూర్తలతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం స్పష్టం చేసింది.

We’re now on WhatsApp. Click to Join.

ఎలక్టోరల్ బాండ్ల ద్వారా అందజేసే విరాళాలపై ఎస్‌బీఐ అందించిన అసంపూర్ణ డేటాపై దాఖలైన పిటిషన్‌పై నేడు విచారణ జరగ్గా అత్యున్నత న్యాయస్థానం ఈ ఆదేశాలు జారీచేసింది. బ్యాంకు అధీనంలో ఉన్న ఎలక్టోరల్ బాండ్లకు సంబంధించిన మొత్తం సమాచారాన్ని బహిర్గితం చేయాలని తాము కోర్టుకుంటున్నట్టు జస్టిస్ చంద్రచూడ్ పేర్కొన్నారు. అంతేకాదు, తాము ఎలాంటి వివరాలను దాచిపెట్టలేదని స్పష్టం చేస్తూ గురువారం సాయంత్రం 5 గంటలలోగా అఫిడవిట్ దాఖలు చేయాలని ఎస్‌బీఐ చైర్మన్‌ను ఆదేశించింది. బ్యాంకు నుంచి ఆ వివరాలు అందిన వెంటనే వాటిని వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేయాలని ఎన్నికల సంఘాన్ని ఆదేశించింది.

read also: Gudivada Amarnath : గాజువాకలో గుడివాడ అమర్‌ ఛాన్స్‌లు చేజారిపోయాయి

Exit mobile version