Mineral Rich States : ఖనిజ వనరులున్న రాష్ట్రాలకు గుడ్ న్యూస్.. సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు

మనదేశంలోని ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్, రాజస్థాన్, బెంగాల్, మధ్యప్రదేశ్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సహా చాలా రాష్ట్రాల్లో అపారమైన ఖనిజ వనరులు ఉన్నాయి.

Published By: HashtagU Telugu Desk
Supreme Court

Mineral Rich States : మనదేశంలోని ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్, రాజస్థాన్, బెంగాల్, మధ్యప్రదేశ్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సహా చాలా రాష్ట్రాల్లో అపారమైన ఖనిజ వనరులు ఉన్నాయి. అలాంటి రాష్ట్రాలకు సుప్రీంకోర్టులో భారీ విజయం లభించింది. గనులు అధికంగా ఉన్న రాష్ట్రాలు.. అక్కడ కార్యకలాపాలు నిర్వహించే మైనింగ్ కంపెనీల నుంచి రాయల్టీపై(Mineral Rich States) గత బకాయిలు వసూలు చేసుకునేందుకు దేశ సర్వోన్నత న్యాయస్థానం అనుమతులు మంజూరు చేసింది.

We’re now on WhatsApp. Click to Join

2005 ఏప్రిల్ 1 నుంచి ఉన్న బకాయిలను కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా  రాష్ట్రాలు వసూలు చేసుకోవచ్చని తెలిపింది. వచ్చే 12 ఏళ్లలో దశలవారీగా ఈ చెల్లింపులు చేయొచ్చని కేంద్ర ప్రభుత్వానికి నిర్దేశించింది. బకాయిల చెల్లింపులపై ఎలాంటి పెనాల్టీలు విధించొద్దని రాష్ట్రాలకు 8 మంది న్యాయమూర్తులతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం సూచించింది. ఈ బెంచ్‌కు భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ సారథ్యం వహించారు. రాయల్టీ అంటే పన్నుతో సమానం కాదని సుప్రీంకోర్టు బెంచ్ వ్యాఖ్యానించగా.. న్యాయమూర్తి జస్టిస్ బీవీ నాగరత్న మాత్రం దీనిపై భిన్నాభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. కాగా, వాస్తవానికి ఖనిజాలు ఉన్న భూమిపై రాయల్టీని విధించే హక్కు రాష్ట్ర ప్రభుత్వాలకు ఉంటుందని గత నెలలోనే సుప్రీం కోర్టు స్పష్టంచేసింది.

Also Read :OP Services Bandh : నేడు తెలంగాణలో ఓపీ సేవలు బంద్.. కారణమిదే..

ఏదిఏమైనప్పటికీ మన దేశంలోని ఖనిజాలు అధికంగా ఉన్న రాష్ట్రాలకు సుప్రీంకోర్టు తీర్పులో భారీగా లబ్ధి చేకూరనుంది. వాటికి మరిన్ని  ఆర్థిక వనరులు అందుబాటులోకి వస్తాయి. వాటిని సద్వినియోగం చేసుకుంటే వివిధ రంగాల వికాసానికి బాటలు వేసుకోవచ్చని పరిశీలకులు అంటున్నారు. ఇకపై ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు తమ భూభాగాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తున్న మైనింగ్ కంపెనీల నుంచి రాయల్టీని వసూలు చేయనున్నాయి.

Also Read :Thangalaan: తంగలాన్ ఎందుకంత స్పెషల్?

కేజ్రీవాల్‌కు మధ్యంతర బెయిల్ ఇవ్వలేం: సుప్రీంకోర్టు

ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో కీలక నిందితుడు, ఆప్ సీనియర్ నేత మనీశ్ సిసోడియాకు ఇటీవలే బెయిల్ వచ్చింది. అయితే తనకూ మధ్యంతర బెయిల్ ఇవ్వాలంటూ కేజ్రీవాల్ దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు ఇవాళ తోసిపుచ్చింది. వెంటనే బెయిల్ ఇవ్వలేమని స్పష్టం చేసింది. ఈ పిటిషన్‌పై స్పందన తెలపాలని సీబీఐకు నోటీసులు జారీ చేసింది.

  Last Updated: 14 Aug 2024, 12:02 PM IST