Site icon HashtagU Telugu

SBI – April 1st : ఎస్‌బీఐ డెబిట్ కార్డు వాడుతారా ? ఇది తెలుసుకోండి

Sbi April 1st

Sbi April 1st

SBI – April 1st :ఎస్‌బీఐకి చెందిన కోట్లాది మంది ఖాతాదార్లకు షాక్ ఇది. ఈ బ్యాంక్‌ తన వివిధ డెబిట్ కార్డ్‌ల ‍‌వార్షిక నిర్వహణ ఛార్జీలను పెంచింది. ఏప్రిల్ 1 నుంచి ఈ పెంపు అమల్లోకి వస్తుంది. వివిధ SBI డెబిట్ కార్డుల వార్షిక నిర్వహణ ఛార్జీని రూ. 75 వరకు పెంచారు.  క్లాసిక్, సిల్వర్, గ్లోబల్, కాంటాక్ట్‌లెస్ డెబిట్ కార్డ్ యూజర్లు వార్షిక నిర్వహణ ఛార్జీ రూపంలో రూ. 200 + GST చెల్లించాలి. ప్రస్తుతం ఈ ఛార్జీ రూ. 125 + GSTగా ఉంది. ఇక  యువ, గోల్డ్, కాంబో డెబిట్ కార్డ్, మై కార్డ్ (ఇమేజ్ కార్డ్) యూజర్ల నుంచి ప్రస్తుతం రూ. 175 + GST తీసుకుంటున్నారు. ఇకపై రూ. 250 + GSTని వసూలు చేస్తారు. మరోవైపు  ప్లాటినం డెబిట్ కార్డ్ వినియోగదార్ల నుంచి ఇప్పుడు రూ. 250  + GST వసూలు చేస్తుండగా.. ఇకపై రూ. 325  + GSTని వసూలు చేయనున్నారు. ప్రైడ్, ప్రీమియం బిజినెస్ డెబిట్ కార్డ్‌ల వార్షిక నిర్వహణ ఛార్జీ ప్రస్తుతమున్న రూ. 350 + GST నుంచి రూ. 425  + GSTకి పెరగనుంది.

We’re now on WhatsApp. Click to Join

రివార్డ్‌ పాయింట్లు రద్దు 

Also Read :Keshavrao – Congress : కాసేపట్లో కేసీఆర్‌తో కేకే భేటీ.. కారు పార్టీకి గుడ్ బై ?