Site icon HashtagU Telugu

Savings – Crisis : దేశంలో పొదుపు డౌన్.. అప్పులు డబుల్

Savings Crisis

Savings Crisis

Savings – Crisis : దేశంలోని ప్రజల సేవింగ్స్ సగానికి సగం పడిపోగా, అప్పులు రెండింతలు పెరిగాయి. ఇది ప్రతిపక్ష రాజకీయ పార్టీలు చెబుతున్న మాట కాదు. ప్రభుత్వ రంగంలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) తయారు చేసిన రీసెర్చ్  రిపోర్టులోని అంశం ఇది. దేశ ప్రజలు పొదుపు చేయడం మానేసి.. భారీగా అప్పులు చేస్తూ ఆస్తులను, వాహనాలను పెద్ద ఎత్తున కొంటున్నారని ఈ నివేదిక తెలిపింది. దేశంలోని కుటుంబాల సేవింగ్స్ 2022- 23 ఆర్థిక సంవత్సరంలో 55 శాతం డౌన్ అయి, 47 ఏళ్ల కనిష్ఠానికి పతనమయ్యాయని ఎస్బీఐ రిపోర్టు పేర్కొంది.

Also read : Ap Assembly : రెండో రోజు కూడా అదే గందరగోళం..విజిల్ వేస్తూ హల్చల్ చేసిన బాలకృష్ణ

దేశంలోని ఫ్యామిలీల అప్పుల భారం 2020-21 ఆర్థిక సంవత్సరం నుంచి 2022- 23 ఆర్థిక సంవత్సరం వరకు డబుల్ అయి రూ. 15.6 లక్షల కోట్లకు చేరిందని వివరించింది. 2022- 23 ఆర్థిక సంవత్సరంలో మన దేశ కుటుంబాల మొత్తం అప్పులు రూ. 8.2 లక్షల కోట్లకు పెరిగాయి. ఈ అప్పులో రూ. 7.1 లక్షల కోట్లు బ్యాంకు లోన్స్ ఉండగా.. మిగతా మొత్తంలో హోమ్ లోన్స్, రిటైల్ లోన్స్ ఉన్నాయి. రిటైల్ లోన్స్ లో హోమ్, ఎడ్యుకేషన్, వెహికల్ లోన్స్ వాటా ఎక్కువగా (Savings – Crisis)  ఉంది. రియల్ ఎస్టేట్ లో పెరుగుతున్న బూమ్ కారణంగా దేశ ప్రజల తమ పెట్టుబడిని స్థిరాస్తుల కొనుగోలు వైపు మళ్లిస్తున్నారని అంటున్నారు.

Exit mobile version