Site icon HashtagU Telugu

SBI Recruitment 2022: ఎలాంటి ఎగ్జామ్ లేకుండానే బ్యాంకులో ఉద్యోగం. జీతం రూ. 19.50లక్షలు..!!

Sbi

Sbi

బ్యాంకు ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు ఇది శుభవార్త. స్టేట్ బ్యాంక్ ఇండియా స్పెషలిస్ట్ క్యాడర్ ఆఫీసర్ పోస్టుల కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఎస్ బీఐ అధికారిక వెబ్ సైట్ sbi.co.in ద్వారా ఆన్ లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ దరఖాస్తు ప్రక్రియ నవంబర్ 22 నుంచి ప్రారంభమైంది.

ఎస్ బిఐ రిక్రూట్ మెంట్ 2022 నోటిఫికేషన్ ప్రకారం..స్పెషలిస్ట్ క్యాడర్ ఆఫీసర్ పోస్టులపై మొత్తం 65 ఖాళీలను భర్తీ చేసేందుకు ఈ రిక్రూట్ మెంట్ డ్రైవ్ నిర్వహించింది. చివరి తేదీ డిసెంబర్ 22.

పోస్టుల వారీగా ఖాళీలు
మేనేజర్ 5 పోస్టులు
మేనేజర్ ( ప్రొడక్ట్, డిజిటల్ పేమేంట్ ) 2 పోస్టులు
మేనేజర్ ( పాజెక్ట్స్ డిజిటల్ ప్లాట్ ఫాం) 2 పోస్టులు
క్రెడిట్ మేనేజ్ 5 పోస్టులు
సలహాదరు 1 పోస్టు

ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు కనీసం 25 ఏళ్లు , గరిష్టంగా 35ఏళ్లు ఉండాలి. విద్యార్హత పని అనుభవం భిన్నంగా ఉంటాయి. పూర్తి వివరాల కోసం నోటిఫికేషన్ చూడండి. అయితే పైన పేర్కొన్న పోస్టులకు ఎలాంటి రాత పరీక్ష ఉండదు. కొన్ని పోస్టులకు ఇంటర్వ్యూ 100మార్కులకు ఉంటుంది. కేవలం ఇంటర్వ్యూలో వచ్చిన మార్కుల ఆధారంగా ఎంపిక చేస్తారు. దరఖాస్తు రుసుము రూ. 750. సీటీసీ సంవత్సరానికి 19.50లక్షలు.