Site icon HashtagU Telugu

SBI : ఒకే టోల్ ఫ్రీ నెంబ‌ర్ తో ఎస్బీఐ సేవ‌లు

Sbi

Sbi

ఇంటి నుంచే ఖాతాదారులు సేవ‌ల‌ను పొంద‌డానికి స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా స‌రికొత్త టోల్ ఫ్రీ నెంబ‌ర్ ను ప్ర‌క‌టించింది. దానికి ఫోన్ చేయ‌డం ద్వారా ఖాతా వివ‌రాల‌ను పూర్తిగా పొందొచ్చు. ఇందుకోసం ఖాతాదారులు ఎవరైనా అత్యంత సులభంగా గుర్తుంచుకోగలిగేలా 1800 1234 టోల్ ఫ్రీ నంబర్ ను ప్రవేశపెట్టింది. దీనికి కాల్ చేయడం ద్వారా ఖాతాలోని నగదు నిల్వ, ఇంతకు ముందటి 5 లావాదేవీలు, ఏటీఎం కార్డు, చెక్కుబుక్కులకు సంబంధించిన వివరాలు, బ్లాక్ చేయడం, కొత్త వాటి కోసం దరఖాస్తు చేయడం తదిత‌ర సేవ‌ల‌ను పొంద‌డానికి అవ‌కాశం ఉంద‌ని స్టేట్ బ్యాంకు ప్రకటించింది.

ఇంటర్నెట్, యాప్ లు, ఇతర ఆన్ లైన్ విధానాలను వినియోగించుకోలేని ఖాతాదారులకు ఈ కొత్త టోల్ ఫ్రీ నంబర్ ఉపయుక్తంగా ఉండనుంది. నిర‌క్ష్యరాస్యులు, పెద్ద వయసువారు కూడా సులభంగా వినియోగించుకోవచ్చు. దీని సేవలు వారంలో ఏడు రోజులు, 24 గంటల పాటూ అందుబాటులో ఉంటాయి. కాబట్టి ఇతర ప్రాంతాలకు వెళ్లినప్పుడు, ప్రయాణ సమయాల్లో కూడా ఉపయోగకరంగా ఉండనుంది. ప్ర‌స్తుతం ఉన్న ఇతర టోల్ ఫ్రీ నంబర్లు యథాతథంగా కొనసాగుతాయని స్టేట్ బ్యాంకు ప్ర‌క‌టించింది.

Exit mobile version