Site icon HashtagU Telugu

SBIF Scholarship : ఎస్బీఐఎఫ్ ఆశా స్కాలర్ షిప్.. ప్రతిభా విద్యార్థుల పాలిట వరం.. రూల్స్ ఇవే

sbi foundation scholarship

sbi foundation scholarship

SBIF Scholarship : విద్యలో రాణించే పేద విద్యార్థులను ప్రోత్సహించేందుకు ఎస్బీఐ ఫౌండేషన్ తనవంతు సహకారాన్ని అందిస్తోంది. 6 నుంచి 12వ తరగతి వరకూ ఎస్బీఐ ఫౌండేషన్ ఆశా స్కాలర్ షిప్ పేరిట సహాయం చేస్తుంది. దేశవ్యాప్తంగా అర్హులైన విద్యార్థులు ఈ స్కాలర్ షిప్ కు అప్లై చేసుకోవచ్చు. అర్హులైనవారికి రూ.10వేలు స్కాలర్ షిప్ గా అందిస్తారు. విద్యార్థులు నవంబర్ 30లోగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

స్కాలర్ షిప్ కు అర్హతలు..

స్కాలర్ షిప్ కు 6 నుంచి 12వ తరగతి వరకూ చదువుకునే భారతీయ విద్యార్థులెవరైనా అప్లై చేసుకోవచ్చు.

గత విద్యాసంవత్సరంలో కనీసం 75 శాతం మార్కులు వచ్చి ఉండాలి. కుటుంబ ఆదాయం ఏడాదికి రూ.3 లక్షలు మించరాదు.

గత విద్యాసంవత్సరానికి సంబంధించిన మార్కుల షీట్, ప్రభుత్వ గుర్తింపు కార్డు (ఆధార్, పాన్ వంటివి), ప్రస్తుత అడ్మిషన్ ఆధారాలు (ఫీజు రిసిప్ట్, అడ్మిషన్ లెటర్ లేదా ఐడీ కార్డు, బోనఫైడ్ సర్టిఫికేట్), ఆదాయానికి సంబంధించిన ఫామ్ 16ఏ లేదా శాలరీ స్లిప్, దరఖాస్తు దారు ఫొటో ఇవ్వాలి.

ఇలా అప్లై చేసుకోవాలి

అర్హులైన వారు ఈమెయిల్, మొబైల్ నంబర్ లేదా జీమెయిల్ ఖాతాలతో https://www.sbifoundation.in/focus-area-detail/SBIF-Asha-Scholarship లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి.

దరఖాస్తును పూర్తిచేసేటపుడు అడిగిన డాక్యుమెంట్లు అప్ లోడ్ చేయాలి. అన్నీ పూర్తయ్యాక ప్రివ్యూలో అన్ని సరిగ్గా ఉన్నాయో లేదో చూసుకుని సబ్మిట్ చేయాలి.

మెరిట్, ఆర్థిక పరిస్థితి ఆధారంగా స్కాలర్ షిప్ కు ఎంపిక చేసి..అప్లికేషన్లను షార్ట్ లిస్ట్ చేస్తారు. ఆ తర్వాత అభ్యర్థులను పర్సనల్ ఇంటర్వ్యూ చేస్తారు.

ఎంపికైన అభ్యర్థులకు నేరుగా బ్యాంకు ఖాతాల్లోకి స్కాలర్ షిప్ ను జమ చేస్తారు. ఇది వన్ టైమ్ స్కాలర్ షిప్ మాత్రమే.

ఏవైనా సందేహాలుంటే.. 011-430-92248 (Ext:303) నంబర్ ను సోమవారం నుంచి శుక్రవారం వరకూ ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల లోగా సంప్రదించవచ్చు. లేదంటే.. sbiashascholarship@buddy4study.com కు మీ సందేహాలను ఈమెయిల్ చేయవచ్చు.