Site icon HashtagU Telugu

PM Modi: సావిత్రీబాయి ఫూలే సమాజంలో కొత్త స్ఫూర్తిని నింపారు: మోడీ

PM Modi Birthday

Pm Modi Slams Congress' Karnataka Manifesto, Says They Vowed To Lock Those Who Chant 'jai Bajrang Bali'

PM Modi: సావిత్రీబాయి ఫూలే,  రాణి వేలు నాచియార్‌ల జయంతి సందర్భంగా ప్రధాన మంత్రి  నరేంద్ర మోదీ ఘన నివాళులు అర్పించారు. వారి కరుణ,  ధైర్యం సమాజానికి స్ఫూర్తినిచ్చాయని, మన దేశం పట్ల వారి సహకారం అమూల్యమైనదని మోదీ అన్నారు. 1831 జనవరి 3 వ తేదీన మహారాష్ట్ర లోని సతారా లో ఒక దళిత కుటుంబంలో జన్మించిన సావిత్రి భాయి తన భర్త తో కలిసి పూణే లో తొలి సారిగా బాలికల కోసం విద్యాలయాన్ని ప్రారంభించారు.

సంఘ సంస్కర్తగా, రచయిత్రిగా సమాజంలో ఒక కొత్త స్ఫూర్తిని నింపారు. రాణి వేలు నాచియార్ శివగంగ ను ఏలిన రాణి. 1798 లో జన్మించిన రాణి వేలు ఆంగ్లేయులపై సమర శంఖం మోగించి, గొప్ప పోరాట పటిమ ను ప్రదర్శించారు.

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేడు కేరళలో పర్యటించనున్నారు. మధ్యాహ్నం కొచ్చి చేరుకోనున్న ప్రధాని మోదీ.. త్రిసూర్‌ లో  కుట్టనల్లూరు నుండి నాయక్‌నాల్ వరకు ఒకటిన్నర కిలోమీటర్ల రోడ్ షోలో పాల్గొంటారు.  త్రిస్సూర్‌లోని తెక్కింకడు మైదానంలో జరిగే స్త్రీ శక్తి బహిరంగ సభలో మహిళలను ఉద్దేశించి ప్రసంగిస్తారు.  స్త్రీశక్తి  ర్యాలీలో  దాదాపు రెండు లక్షల మంది మహిళలు, అంగన్‌వాడీ టీచర్లు, ఆశా వర్కర్లు, పారిశ్రామికవేత్తలు, కళాకారులు, మహాత్మా గాంధీ నారెగా సభ్యులు  పాల్గొననున్నారు.