Site icon HashtagU Telugu

Sardar Patel Jayanti: నేడు సర్దార్ పటేల్ 147వ జయంతి…నివాళులర్పించిన ప్రధాని, రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, హోంమంత్రి..!!

Patel (1)

Patel (1)

నేడు స్వాతంత్ర్య సమరయోధుడు, ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ 147వ జయంతి. ఈరోజు సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా దేశం ఆయనను స్మరించుకుంటుంది. ఈ సందర్భగా ఢిల్లీలోని పటేల్ చౌక్ లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సర్దార్ వల్లభాయ్ పటేల్ కు నివాళులర్పించారు. ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖర్ తోపాటు కేంద్ర హోమంత్రి అమిత్ షా పటేల్ చౌక్ వద్ద సర్దార్ వల్లభాయ్ పటేల్‌కు నివాళులర్పించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ  గుజరాత్ లో స్టాచ్యూ ఆఫ్ యూనిటీ వద్ద పటేల్ కు ఘనంగా నివాళుర్పించారు.

సర్దార్ పటేల్ గుజరాత్‌లోని నడియాడ్‌లో అక్టోబర్ 31న జన్మించారు. సర్దార్ పటేల్ దేశానికి మొదటి ఉప ప్రధాని, హోం మంత్రి కూడా. ప్రధాని మోదీ విజ్ఞప్తి మేరకు 2014లో ఆయన జయంతి సందర్భంగా దేశంలో తొలిసారిగా జాతీయ ఐక్యతా దినోత్సవాన్ని జరుపుకోవడం గమనార్హం. 2014 నుండి ప్రతి సంవత్సరం అక్టోబర్ 31ని జాతీయ ఐక్యతా దినోత్సవం లేదా జాతీయ ఐక్యతా దినోత్సవంగా జరుపుకుంటున్నారు.