Sarabjit Singh Khalsa : ఇందిరాగాంధీ హంతకుడి కుమారుడి లీడ్

బియాంత్ సింగ్.. మాజీ ప్రధానమంత్రి ఇందిరా గాంధీ హంతకుల్లో ఒకరు.

Published By: HashtagU Telugu Desk
Sarabjit Singh Khalsa

Sarabjit Singh Khalsa

Sarabjit Singh Khalsa : బియాంత్ సింగ్.. మాజీ ప్రధానమంత్రి ఇందిరా గాంధీ హంతకుల్లో ఒకరు. బియాంత్ సింగ్ కొడుకు సరబ్ జీత్ సింగ్ ఖల్సా ఈసారి పంజాబ్‌లోని ఫరీద్ కోట్ లోక్‌సభ స్థానం నుంచి ఇండిపెండెంట్ అభ్యర్థిగా బరిలోకి దిగారు. తన సమీప ప్రత్యర్థి, ఆప్ అభ్యర్థి కరమ్‌జిత్ సింగ్ అన్మోల్‌పై  సరబ్ జీత్ సింగ్(Sarabjit Singh Khalsa) దాదాపు 51వేల ఓట్ల ఆధిక్యంలో దూసుకు పోతున్నారు.  ఇండిపెండెంట్‌గా పోటీ చేసినప్పటికీ ప్రధాన రాజకీయ  పార్టీల అభ్యర్థులకు మించిన రేంజులో ఓట్లను సాధించడంలో సరబ్ జీత్ సింగ్ సఫలమయ్యారు.

We’re now on WhatsApp. Click to Join

ఖలిస్తాన్ వేర్పాటు వాది అమృత్‌పాల్ సింగ్‌ కూడా ఈసారి పంజాబ్‌లోని ఖడూర్ సాహిబ్ లోక్‌సభ స్థానం నుంచి పోటీచేశారు. ఆయన కూడా స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగి  ఆధిక్యంలో దూసుకుపోతున్నారు. అమృత్‌పాల్ సింగ్‌‌కు ఇప్పటివరకు 190416 ఓట్లు వచ్చాయి. రెండో స్థానంలో ఉన్న కాంగ్రెస్ అభ్యర్థి కుల్బీర్ సింగ్ జీరాకు 116317 ఓట్లు దక్కాయి. ఇక మూడో స్థానంలో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ అభ్యర్థి లల్జిత్ సింగ్ భుల్లర్‌కు 99318 ఓట్లు వచ్చాయి. మొత్తం మీద చూస్తే పంజాబ్‌లో కాంగ్రెస్ పార్టీ ఆరు స్థానాల్లో, ఆప్ మూడు స్థానాల్లో, శిరోమణి అకాలీదళ్ రెండు స్థానాల్లో లీడ్‌లో ఉన్నాయి.

Also Read : TDP : చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి ముహూర్తం ఖరారు..?

  Last Updated: 04 Jun 2024, 02:06 PM IST