Salman Khan : బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్‌ఖాన్‌కు గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయి బెదిరింపులపై రైతు నాయకుడు రాకేశ్ టికాయత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బిష్ణోయి తెగకు సల్మాన్ బహిరంగ క్షమాపణలు చెప్తే మొత్తం ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుందని తాను అనుకుంటున్నానని టికాయత్ వ్యాఖ్యానించారు. ఇతరుల ప్రాణాలు అవలీలగా తీస్తున్న ఆ దుర్మార్గులతో విరోధాన్ని కలిగి ఉండటం సల్మాన్‌కు ఎంతమాత్రం మంచిదికాదని ఆయన అభిప్రాయపడ్డారు. సల్మాన్ ఇప్పటికైనా బిష్ణోయిలకు సంబంధించిన ఏదైనా ఆలయానికి వెళ్లి.. గతంలో కృష్ణజింకలను వేటాడినందుకు క్షమాపణలు చెప్పుకోవాలని టికాయత్ సూచించారు. తద్వారా సల్మాన్‌పై లారెన్స్ ముఠాకు కోపం తగ్గుతుందన్నారు. ఒకవేళ సల్మాన్(Salman Khan) సారీ చెప్పకుంటే.. లారెన్స్ గ్యాంగ్ ఏదైనా అఘాయిత్యానికి పాల్పడుతుందేమో అని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ప్రాణాలకు ముప్పు తెచ్చుకోకుండా సల్మాన్ వ్యవహరిస్తే సరిపోతుందన్నారు.
Also Read :QR Coin Machine : క్యూఆర్ కోడ్‌తో స్కాన్ కొట్టు.. చేతి నిండా చిల్లర పట్టు
గతంలో కృష్ణజింకలను సల్మాన్ ఖాన్ వేటాడారు. దానిపై అప్పట్లో కేసు నమోదు కావడం యావత్ దేశంలో సంచలనం క్రియేట్ చేసింది. కృష్ణజింకలను బిష్ణోయి వర్గం వారు పవిత్రమైనవిగా భావిస్తారు. వాటిని సల్మాన్ వేటాడటాన్ని అప్పట్లో బిష్ణోయి వర్గం తీవ్రంగా ఖండించింది. ఈక్రమంలోనే కృష్ణజింకలను వేటాడినందుకు బిష్ణోయి వర్గం ప్రజలకు సారీ చెప్పాలని పలుమార్లు లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ నుంచి సల్మాన్‌ఖాన్‌కు వార్నింగ్స్ వచ్చాయి. అయితే దీనిపై తాను చట్టపరంగా ప్రొసీడ్ అవుతానని, ఉద్దేశపూర్వకంగా కృష్ణజింకలను చంపలేదని సల్మాన్ ఖాన్ పదేపదే స్పష్టం చేశారు.
Also Read :Raj Pakala : కేటీఆర్ బావమరిది రాజ్ పాకాల ఫాంహౌస్‌లో రేవ్ పార్టీ.. పోలీసుల రైడ్స్
బొద్దింకలను చంపడం కూడా సల్మాన్‌కు తెలియదు
ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో సల్మాన్ ఖాన్ తండ్రి సలీం ఖాన్ కీలక కామెంట్స్ చేశారు. సల్మాన్‌కు మూగజీవాలను వెంటాడటం ఇష్టం ఉండదని తేల్చి చెప్పారు. జంతువులను సల్మాన్ ప్రేమిస్తాడని పేర్కొన్నారు. సల్మాన్ క్షమాపణ చెబితే తప్పు చేసినట్లుగా అంగీకరించినట్లు అవుతుందన్నారు. బొద్దింకలను చంపడం కూడా సల్మాన్‌కు తెలియదని చెప్పారు.