Site icon HashtagU Telugu

Ludhiana: శ్మశానాల్లోని అస్థికలతో వ్యాపారం.. ఇద్దరు అరెస్ట్!

Bones

Bones

డబ్బు సంపాదనే లక్ష్యంగా బతుకున్నారు అడ్డదారులు తొక్కుతున్నారు కొందరు. అందుకోసం చేయకూడని పనులు చేయడానికి సిద్ధపడుతున్నారు. చివరకు చచ్చిన శవాలను సైతం వదలడం లేదు. పంజాబ్ లూధియానాలో శ్మశానాలలోని అస్థికలను తాంత్రికులకు విక్రయిస్తున్న ఘటన వెలుగుచూసింది. ఈ దందా నిర్వహిస్తున్న ముఠాలోని ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. మిగతా వారి కోసం గాలిస్తున్నారు. అస్థికలను రూ.లక్షా 50 వేలకు అమ్ముతున్నట్లు తెలిసింది. ఈ వ్యాపారం చేస్తున్నట్లు పోలీసులు విచారణలో నిందితులు ఒప్పుకున్నారు. ఓ వ్యక్తి ఫిర్యాదుతో ఈ ముఠా చేస్తున్న వ్యాపారం గురించి పోలీసులకు తెలిసింది. అయితే ఈ దందా చాలా కాలంగా కొనసాగిస్తున్నట్టు పోలీసుల విచారణలో తేలింది.