Sadhguru Health Condition : సద్గురు జగ్గీ వాసుదేవ్‌ ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందంటే..!!

ఢిల్లీ అపోలో హాస్పిటల్‌లో ఆయన మెదడుకు ఆపరేషన్‌ జరిగింద‌ని, ప్రస్తుతం వెంటిలేటర్‌పై ఆయనకు చికిత్స అందిస్తున్నట్లు అపోలో డాక్టర్లు స్పష్టంచేశారు

Published By: HashtagU Telugu Desk
Sadhguru Health Condition

Sadhguru Health Condition

ప్రముఖ ఆధ్యాత్మిక గురువు ఇషా ఫౌండేషన్ వ్యవస్థాపకుడు జగ్గీ వాసుదేవ్ (Sadhguru Jaggi Vasudev) ఆరోగ్య పరిస్థితి (Health Condition) కాస్త ఆందోళనకారణంగా ఉంది. ఢిల్లీ అపోలో హాస్పిటల్‌లో ఆయన మెదడుకు ఆపరేషన్‌ జరిగింద‌ని, ప్రస్తుతం వెంటిలేటర్‌పై ఆయనకు చికిత్స అందిస్తున్నట్లు అపోలో డాక్టర్లు స్పష్టంచేశారు. గడిచిన నాలుగు వారాలుగా తీవ్రమైన తలనొప్పితో బాధపడుతున్నారు సద్గురు. అయినప్పటికీ శివరాత్రి వేడుకలు నిర్వహించారు. అయితే మార్చి 15 నాటికి తలనొప్పి తీవ్రమైనట్లు సమాచారం.

We’re now on WhatsApp. Click to Join.

మార్చి 16న MRI స్కాన్‌ తీయగా జగ్గీవాసుదేవ్‌ మెదడులో తీవ్ర రక్తస్రావం, వాపును గుర్తించారు డాక్టర్లు. దీనితో ఆయనకు డాక్టర్ వినీత్ సూరి, డాక్టర్ ప్రణవ్ కుమార్, డాక్టర్ సుధీర్ త్యాగి, డాక్టర్ ఎస్ ఛటర్జీతో కూడా మెడికల్ టీమ్ బ్రెయిన్ సర్జరీ చేసింది. బ్లీడింగ్‌ను నివారించింది. సర్జరీ తరువాత కొన్ని గంటలపాటు వెంటిలేటర్‌పై ఉన్నారని తెలిపింది. ఆపరేషన్ తర్వాత ఆయన మాట్లాడిన వీడియోను షేర్ చేశారు. తనకు ఏం కాలేదని వీడియోలో చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ప్రధాని మోడీ తో పాటు పలువురు రాజకీయ ప్రముఖులు, ఇతర సేవ రంగాల వారు జగ్గీ వాసుదేవ్ ఆరోగ్యం ఫై అరా తీయడం చేసారు. ప్రధాని మోడీ స్వయంగా ఫోన్ చేసి ఆరోగ్య వివరాలు తెలుసుకున్నారు.

Read Also : YS Sharmila : షర్మిల ఫిక్స్ అయ్యిందా..?

  Last Updated: 21 Mar 2024, 10:41 AM IST