Site icon HashtagU Telugu

Ukraine Russia War: సామాన్యుల‌పై ర‌ష్యా ఉక్రోషం..!

Russian Forces Attack Ukraine Civilians

Russian Forces Attack Ukraine Civilians

ఉక్రెయిన్ పై ర‌ష్యా దండ‌యాత్రం కొన‌సాగుతూనే ఉంది. ఉక్రెయిన్‌పై దాడులు ఆపాలని అంతర్జాతీయ న్యాయస్థానం ఇచ్చిన ఆదేశాలను రష్యా తిరస్కరించింది. ఈ క్ర‌మంలో ఐసీజే ఆదేశాలను తాము పాటించబోమని రష్యా తేల్చిచెప్పింది. ఇక తాజాగా ఉక్రెయిన్ పై ర‌ష్యా సైన్యం దాడులు మ‌రింత తీవ్ర‌త‌రం చేసింది. ఉక్రెయిన్ సైనిక స్థావ‌రాల‌తో పాటు, జ‌నావాసాల పై బాంబుల‌తో విరుచుకుప‌డుతుంద‌ది. మ‌రోవైపు ఉక్రెయిన్ కూడా ర‌ష్యాకు ధీటుగానే బ‌దులిస్తుంది. ఈక్ర‌మంలో ఇప్ప‌టి వ‌ర‌కు 14 వేల మంది రష్యా సైనికుల్ని హ‌త‌మార్చామ‌ని ఉక్రెయిన్ ప్రకటించింది.

ఇక ప్రంపంచ దేశాలు రష్యాపై ప‌లు ర‌కాల ఆంక్ష‌లుతో పాటు, ఆర్థిక ఆంక్షలు విధించినా, ర‌ష్యా అధ్య‌క్షుడు పుతిన్ మాత్రం ఎవ‌రినీ లెక్క‌చేయ‌కుండా యుద్ధాని కంటిన్యూ చేస్తున్నారు. ఈ క్ర‌మంలో ఇప్పటికే ఉక్రెయిన్ సరిహద్దుల్లోని కీలక పట్టణాలను స్వాధీనం చేసుకున్న రష్యా, ఇప్ప‌టి వ‌ర‌కు దాదాపు ఆ దేశంలోని 20కి పైగా నగరాలను రష్యా సైనిక బ‌ల‌గాలు స్వాధీనం చేసుకున్నాయ‌ని వార్త‌లు వ‌స్తున్నాయి. అయితే రాజధాని కీవ్‌ను స్వాధీనం చేసుకోవ‌డం కోసం రష్యా సైనిక బలగాలు తీవ్రంగా పోరాటం చేస్తున్నాయి. ఈ క్ర‌మంలో కీవ్ పై బాంబులతో విరుచుకుపడుతున్నాయి.

మ‌రోవైపు ఉక్రెయిన్ రాజధాని కీవ్‌ను కాపాడుకునేందుకు ఉక్రెయిన్ సైనిక బ‌ల‌గాలు తీవ్రంగా ప్రతిఘటిస్తున్నాయి. ఈ క్ర‌మంలో ఉక్రెయిన్ సైన్యం, రష్యా బలగాలను ఎక్కడికక్కడ అడ్డుకుంటున్నాయి. దీంతో రష్యా బలగాలు సాధారణ పౌరులను టార్గెట్ చేసుకుని బాంబు దాడులు చేస్తున్నాయి. అంతేకాకుండా జనావాసాలపైకి క్ష‌ప‌ణుల‌ను ప్రయోగిస్తున్నాయి ర‌ష్యా బ‌ల‌గాలు. అక్క‌డి ప్రజలు తలదాడుకున్న థియేటర్లు, అపార్టుమెంట్లపై ర‌ష్యా సైనిక బ‌ల‌గాలు బాంబులు వేస్తున్నారు. దీంతో అక్క‌డ భారీగా ప్రాణ నష్టం సంభవిస్తోంది.

ఉక్రెయిన్‌ ఉత్తర ప్రాంతంలోని చెర్నిహివ్‌ పట్టణంలో బ్రెడ్‌ కోసం క్యూలో నిలబడి ఉన్న 13 మందిని రష్యా సైనికులు కాల్చి చంపేశారు. అలాగే ఖార్కివ్ నగర శివారు ప్రాంతంలో ఉండే మెరెఫా పట్టణంలోని పాఠశాల, సాంస్కృతిక కేంద్రం పై ర‌ష్యా సైన్యం బాంబు దాడుల‌కు దిగింది. దీంతో ఈ దాడుల్లో 21 మంది మరణించగా, మరో 25 మంది గాయపడ్డారని వార్త‌లు వ‌స్తున్నాయి. ఇక‌పోతే ప్రస్తుతం రష్యా చర్యలపై అంతర్జాతీయంగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ర‌ష్యా సైనికులు జనావాసాలపై చేస్తున్న దాడులను ప్ర‌పంచ దేశాలు తీవ్రంగా ఖండిస్తున్నారు. అయితే ఎవ‌రినీ ప‌ట్టించుకోని ర‌ష్యా ఉక్రెయిన్‌పై భీకర దాడికి పాల్పడుతోంది.

 

Exit mobile version