Site icon HashtagU Telugu

Ukraine Russia War: ర‌ష్యా చేతికి ఉక్రెయిన్ రాజ‌ధాని.. కీవ్‌లో ప్రవేశించిన పుతిన్ ఫోర్స్..!

Ukraine Capital Kiev

Ukraine Capital Kiev

ఉక్రెయిన్ పై ర‌ష్యా దండ‌యాత్ర కొన‌సాగుతూనే ఉంది. ఇప్ప‌టికే రెండు దేశాల మ‌ధ్య ప‌లుసార్లు జ‌రిగిన చర్చలు కొలిక్కి రాలేదు. దీంతో 16వ రోజు ఉక్రెయిన్‌పై రష్యా సేనల దాడులు కొనసాగుతున్నాయి. ఈ క్ర‌మంలో ఎట్ట‌కేల‌కు ర‌ష్యా సైనిక బ‌ల‌గాలు అనుకున్న‌ది సాధించాయ‌ని తెలుస్తుంది. 17 రోజులుగా ఉక్రెయిన్‌లోని ప్ర‌ధాన న‌గ‌రాల‌పై ర‌ష్యా సైన్యం బాంబులు, క్షిప‌ణుల‌తో విరుచుకుప‌డుత‌న్నా, ఉక్రెయిన్ రాజ‌ధాని కీవ్‌ను హస్తగతం చేసుకోలేకపోయింది.

అయితే ప్ర‌స్తుతం ఉక్రెయిన్ రాజ‌ధాని కీవ్ న‌గ‌రంలోకి ర‌ష్యా సైనిక ద‌ళాలు ప్ర‌వేశించాయని వార్త‌లు వ‌స్తున్నాయి. ఈ నేఫ‌ధ్యంలో భార‌త కాలమానం ప్ర‌కారం శుక్రవారం రాత్రి ర‌ష్యా బ‌ల‌గాలు కీవ్ న‌గ‌రంలోకి ప్ర‌వేశించిన‌ట్లు అంత‌ర్జాతీయ మీడియా సంస్థ‌లు క‌థ‌నాలు ఇచ్చాయి. కీవ్‌లోకి ఎంట్రీ ఇవ్వ‌డంతోనే ర‌ష్యా బ‌ల‌గాలు భీక‌రంగా కాల్పులు జ‌రుపుతూ ముందుకు సాగుతున్నట్టు తెలిపాయి. ఇక క్రెయిన్‌లోని ప్ర‌ధాన న‌గ‌రాలు, ప‌ట్ట‌ణాల‌ను ర‌ష్యా బ‌ల‌గాలు ఇప్ప‌టికే త‌న స్వాధీనం చేసుకున్న సంగ‌తి తెలిసిందే.

అయితే వాటికంటే ముందుగానే కీవ్‌ను త‌మ వ‌శం చేసుకోవాల‌ని ర‌ష్యా సైనిక బ‌ల‌గాలు భావించాయి. కానీ అక్క‌డ ఉక్రెయిన్ సైన్యంతో పాటు, అక్క‌డి సామాన్య పౌరులు కూడా తిరుగుబాటు చేయ‌డంత‌తో ర‌ష్యా బ‌ల‌గాలు డిఫెన్స్‌లో ప‌డ్డాయి. అయితే నాలుగు వైపుల నుంచి కీవ్‌ను చుట్టుముట్ట‌డంతో శుక్ర‌వారం ర‌ష్యా బ‌ల‌గాలు కీవ్ న‌గ‌రంలోకి ఎంట్రీ ఇచ్చాయ‌ని, దీంతో మ‌రికొన్ని గంట‌ల్లోనే ఉక్రెయిన్ రాజ‌ధాని కీవ్‌ను ర‌ష్యా సేన‌లు త‌మ స్వాధీనంలోకి తీసుకునే అవ‌కా‌శాలున్నాయ‌ని అంత‌ర్జాతీయ మీడియాల్లో వార్త‌లు వినిపిస్తున్నాయి.

ఇక మరోవైపు ఉక్రెయిన్ పై సైనిక చ‌ర్య‌కు పూనుకున్న ఉష్యా అధ్య‌క్షుడు పుతిన్‌ తీరు పై ఇప్ప‌టికే అగ్ర‌రాజ్యం అమెరికా తీవ్రంగా వ్యతిరేకిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ క్ర‌మంలో ఇప్ప‌టికే ర‌ష్యా పై ప‌లు ఆంక్ష‌లు విధించిన అమెరికా, తాజాగా ర‌ష్యా పై మ‌రిన్ని ఆంక్ష‌లు విధించింద‌ని వార్త‌లు వ‌స్తున్నాయి. ఈ క్ర‌మంలో రష్యా నుంచి దిగుమతయ్యే మద్యం, సీఫుడ్, వజ్రాలు తదితర పలు ఉత్పత్తులను నిషేధిస్తున్నట్లు ఆదేశ అధ్యక్షుడు జో బైడెన్ ప్రకటించార‌ని వార్త‌లు వెలువ‌డుతున్నాయి. ర‌ష్యా పై ఈ నిషేధం వెంటనే అమ‌లయ్యేలా ఆదేశాలు జారీ చేయ‌డం గ‌మ‌నార్హం. ఇక‌పోతే ఉక్రెయిన్‌కు మద్దతుగా తమ బలగాలను ఎట్టిపరిస్థితుల్లోనూ పంపించబోమని అమెరికాతో పాటు నాటో దేశాలు పేర్కొన్న సంగ‌తి తెలిసిందే.