Site icon HashtagU Telugu

Ukraine Russia War: ప్ర‌పంచ దేశాలను హ‌డ‌లెత్తిస్తున్న‌.. ర‌ష్యా బ్లాస్టింగ్ వార్నింగ్..!

Vladimir Putin Russia

Vladimir Putin Russia

ఉక్రెయిన్ పై ర‌ష్యా దండ‌యాత్రం కొన‌సాగిస్తున్న సంగ‌తి తెలిసిందే. మూడో రోజు కూడా ఉక్రెయిన్ పై రష్యా భీకర దాడులు కొనసాగుతున్నాయి. ఈ క్ర‌మంలో ఉక్రెయిన్‌లోని ప్రధాన నగరాలపై ర‌ష్యా సైన్యం బాంబులతో విరుచుకుపడుతోంది. దీంతో ఏక్ష‌ణంలో ఏం జరుగుతుందోనని అక్క‌డి ప్రజలు బిక్కుబిక్కుమంటూ బతుకుతున్నారు. ఇక ర‌ష్యా, ఉక్రెయిన్ దేశాలు త‌మ స‌మ‌స్య‌ను చర్చల ద్వారా ప‌రి ష్క‌రించుకుకోవాల‌ని ఇప్ప‌టికే నాటో దేశాల‌తో స‌హా ప‌లు దేశాలు సూచించాయి. మొద‌టి నుంచి యుధ్ధానికి కాలు దువ్వొద్ద‌ని ర‌ష్యాను ప్ర‌పంచ‌ దేశాలు వారించినా, ర‌ష్యా మాత్రం యుద్ధానికే సై అంది.

ఈ నేప‌ధ్యంలో రష్యా పై ప్రంపంచ దేశాలు ఆంక్ష‌లు విధిస్తున్నాయి. సైనికపరంగా చర్యలు తీసుకోవడానికి భయపడుతున్న ప్రపంచ దేశాలు, రష్యా ఫైనాన్షియల్ వార్ ప్రకటిస్తున్నాయి. ఈ క్ర‌మంలో అగ్ర‌రాజ్యాలు అమెరికా, యూకే, యూరోప్‌, ఆస్ట్రేలియా, జపాన్‌ వంటి దేశాలు ఇప్పటికే రష్యాపై వాణిజ్య ప‌ర‌మైన‌ ఆంక్షలు విధించాయి. యూరప్‌ సుస్థిరతకే ప్రమాదంగా మారిన రష్యా సైనిక చర్యలపై కఠినంగా వ్యవహరిస్తామన్న యురోపియన్‌ యూనియన్‌ ఆంక్షలపై డ్రాఫ్ట్‌ సిద్దం చేసింది. అంతకంటే ముందే జర్మనీ తన గ్యాస్‌ ప్రాజెక్టును రద్దు చేసుకుంది. యూకే విమాన సర్వీసులు బ్యాన్ చేయ‌గా, రష్యా పౌరులకు ఇచ్చే ప్రయార్టీ వీసాలను ఈయూ రద్దు చేసింది. కెన‌డా ఎగుమ‌తి అనుమ‌త‌లు ర‌ద్ద చేయ‌గా, రష్యా ఆర్ధిక వ్యవస్థ లక్ష్యంగా అతిపెద్ద బ్యాంకుల పై అగ్ర‌రాజ్యం అమెరికా నిషేధం విధించింది.

అయితే అమెరికా, యూరప్ దేశాల ఆంక్షలపై రష్యా ఊహించ‌ని విధంగా స్పందించింది. త‌న‌ను నిలువ‌రించేందుకు, త‌న‌పై ఏ దేశ‌మైనా ఆంక్ష‌లు విధిస్తే, ఇంట‌ర్నేష‌న‌ల్ స్పేస్ సెంట‌ర్‌ను కూల్చేస్తామ‌ని, ప్ర‌పంచ దేశాలు హ‌డ‌లిపోయేలా ర‌ష్యా సంచ‌ల‌న వార్నింగ్ చేసింది. ఈ మేర‌కు ర‌ష్యా స్పేస్ డైరెక్ట‌ర్ ఈ భీతావ‌హ ప్ర‌క‌ట‌న‌ను విడుద‌ల చేశారు.ఉక్రెయిన్‌తో ఉన్న స‌మ‌స్య‌ల‌ను చ‌ర్చ‌ల‌తోనే ప‌రిష్క‌రించుకోవాల‌ని, నాటో దేశాల‌తో స‌హా చాలా దేశాలు ర‌ష్యాకు చెప్పాయి. అయితే ఎవ‌రి మాటా లెక్క చేయ‌ని వ్లాదిమిర్ పుతిన్, ఉక్రెయిన్ పై ఒక్క‌సారిగా యుద్ధం ప్ర‌క‌టించి, అక్క‌డ ర‌క్త‌పాతం సృష్టిస్తున్నాడు. దీంతో అమెరికాతో పాటు నాటో దేశాలు ర‌ష్యా పై ప‌లు ఆంక్ష‌లు విధిస్తున్నారు. ఇప్ప‌టికే ర‌ష్యా పై అమెరికా సైబ‌ర్ దాడుల‌కు దిగింది, పుతిన్ ఆస్తుల‌ను ఫ్రీజ్ చేస్తామంటూ యూరోపియ‌న్ యూనియ‌న్ హెచ్చ‌రించింది.

దీంతో ప్ర‌పంచ దేశాల‌కు వెన్నులో వ‌ణుకు పుట్టేలా ర‌ష్యా స్పేస్ డైరెక్ట‌ర్ డిమిత్రి రోగోజిన్ తాజాగా ప్ర‌క‌ట‌ణ విదుద‌ల చేశారు. ఈక్ర‌మంలో ర‌ష్యాను ఆంక్షలతో కట్టడి చేయాలని చూస్తే ఫలితం ఇంకోలా ఉంటుందని, యూరోప్‌ దేశాలు, అమెరికా పై స్పేస్ స్టేషన్‌ను కూల్చేస్తే బ్లాస్టింగ్ వార్నింగ్ ఇచ్చింది ర‌ష్యా. చైనా, భార‌త్ దేశాల‌పై కూడా స్పేస్ సెంట‌ర్ ప‌డుతుంద‌ని ర‌ష్యా స్పేస్ డైరెక్ట‌ర్ డిమిత్రి రోగోజిన్ ప్ర‌క‌ట‌ణ ద్వారా వెల్ల‌డించారు. మ‌రోవైపు తాజాగా స్వీడన్, ఫిన్లాండ్ దేశాలకు కూడా ర‌ష్యా సీరియస్ వార్నింగ్ ఇచ్చింది. అలాగే నాటో (నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్) కూటమిలో చేరితే తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుందని, ఈ క్ర‌మంలో ఉక్రెయిన్ తాజాగా ఎదుర్కొంటున్న‌ పరిణామాలు మీరు కూడా ఎదుర్కోవాల్సి వస్తుందని రష్యా తీవ్ర‌స్థాయిలో హెచ్చరించింది. మ‌రి ర‌ష్యా ఇచ్చిన వార్నింగ్ పై ప్ర‌పంచ దేశాలు ఎలా స్పందిస్తాయో చూడాలి.