Site icon HashtagU Telugu

Ukraine Russia War: అమెరికా, బ్రిట‌న్‌ల‌కు.. దిమ్మ‌తిరిగే షాక్ ఇచ్చిన పుతిన్..!

America Britain Puthin

America Britain Puthin

రష్యా, ఉక్రెయిన్ మధ్య యుద్ధం పదో రోజు కూడా భీకరంగా సాగుతోంది. ఉక్రెయిన్ పై దండ‌యాత్ర కొన‌సాగిస్తున్న‌ రష్యా ఉక్రెయిన్‌లోని ప్ర‌ధాన‌ నగరాలను నామ రూపాలు లేకుండా చేస్తున్నాయి. ముఖ్యంగా ఖర్కీవ్, కీవ్ నగరాలపై రష్య మిస్సైల్‌తో దాడి చేస్తుంది. ఇక మ‌రోవైపు యుద్ధాన్ని విరమించుకోవాలని ప్ర‌పంచ దేశాలు విజ్ఞప్తి చేస్తున్నా, మొండిఘ‌టం అయిన‌ పుతిన్ మాత్రం వెనక్కి తగ్గడం లేదు. ఉక్రెయిన్‌ నగరాలపై బాంబుల మోత మోగిస్తూ వెన్న‌క్కి త‌గ్గేదేలే అంటున్నాడు.

ఇక ఉక్రెయిన్ పై సైనిక చర్యతో దూకుడుగా ముందుకు వెళ్తున్న రష్యాను అమెరికా సహా పాశ్చాత్య దేశాలు ఆంక్షలతో ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఈ క్ర‌మంలో అమెరికా, ఈయూ సహా పలుదేశాలు రష్యాపై ఆంక్షలు విధిస్తున్నాయి. ఇప్పటికే తమ గగనతలం నుంచి రష్యా విమానాల రాకపోకలను నిషేధించాయి. అంతే కాకుండా ర‌ష్యన్ స్టేట్ మీడియా తన ఫ్లాట్‌ఫామ్స్‌లో ఆదాయాన్ని ఆర్జించకుండా, దిగ్గ‌జ సంస్థ‌లు మెటా, గూగుల్, యూట్యూబ్ నిషేధం విధించాయి

అయితే మ‌రోవైపు పుతిన్ ర‌ష్యా పై ఆంక్ష‌లు విధిస్తున్న దేశాల‌పై దూకుడుగానే వ్య‌వ‌హ‌రిస్తున్నాడు. తాజ‌గా మ‌రో సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్నాడు పుతిన్. ఈ క్ర‌మంలో ట్విట్టర్, ఫేస్‌బుక్, బీబీసీ, యాప్‌ స్టోర్‌ సేవల్ని యాప్‌ స్టోర్‌ సేవల్ని తమ దేశంలో బ్లాక్ చేసింది రష్యా. ఇప్పటికే 36 దేశాలకు సంబంధించిన విమానాలపై రష్యా నిషేధం విధించిన సంగ‌తి తెలిసిందే. అయితే ఇప్పుడు తాజాగా ట్విట్టర్, ఫేస్‌బుక్‌, బీబీసీ, యాప్ స్టోర్లపై రష్యా బ్యాన్ విధించడం హాట్ టాపిక్‌గా మారింది.

రష్యా, ఉక్రెయిన్ పై పోరుపై ఉక్రెయిన్ తో పాటు ఇతర దేశాల నుంచి వస్తున్న సమాచారానికి అడ్డుకట్ట వేసేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఫేస్‌బుక్, ట్విట్టర్, యాప్‌ స్టోర్‌ అమెరికాకు చెందిన సంస్థలు కాగా, బీబీసీ బ్రిటన్‌కు చెందింది. ఈ యాప్‌ లపై ఆంక్షలు విధించడమంటే అమెరికా, బ్రిటన్ దేశాల‌తో.. రష్యా అంతర్జాల పోరుకు దిగినట్లేనని, రష్యా ప్రపంచ దేశాలతో సై అంటే సై అంటోందని ప‌రిశీల‌కు అభిప్రాయ‌ప‌డుతున్నారు. అయితే పుతిన్ మాత్రం ర‌ష్యాతో య‌థావిధిగా సంబంధాలు కొన‌సాగించాల‌ని, ర‌ష్యా పై ఆంక్ష‌లు విధిస్తే, ల‌బ్ధి పొందేది తామే అని, ఏక‌ప‌క్షంగా నిర్ణ‌యాలు తీసుకుంటే వారికే న‌ష్ట‌మ‌ని పుతిన్ తేల్చి చెప్పాడు.