Site icon HashtagU Telugu

Russia Ukraine War : యుద్ధానికి చైనా స‌హ‌కారం కోరిన ర‌ష్యా

Russia- Ukraine War

Russia- Ukraine War

ఉక్రెయిన్ పై యుద్ధం కొన‌సాగించ‌డానికి చైనా స‌హాయాన్ని ర‌ష్యా కోరింది. రాజ‌ధాని కీవ్ మీద ఆధిప‌త్యం కోసం ర‌ష్యా సైనం చేస్తోన్న ప్ర‌య‌త్నం మూడు వారాలుగా ఫ‌లించ‌లేదు. పైగా వేలాది మంది ర‌ష్యా సైనం చ‌నిపోయింది. శ‌త‌ఘ్నులు, వార్ ట్యాంకులు, య‌ద్ధ విమానాలు, ట్యాంక‌ర్లు, హెలికాప్ట‌ర్ల‌ను వ్యూహాత్మ‌కంగా ఉక్రెయిన్ సైన్యం పెద్ద ఎత్తున కూల్చేసింది. ఒకానొక స‌మ‌యంలో ఉక్రెయిన్ రాజ‌ధాని కీవ్ నుంచి ర‌ష్యా ద‌ళాల‌ను ప‌రుగెత్తించిన ఉక్రెయిన్ సైన్యం ధీటు పోరాడుతోంది.అనూహ్యంగా ర‌ష్యా సైన్యం ఉక్రెయిన్ ద‌ళాల నుంచి ప్ర‌తిఘ‌ట‌న ఎదుర్కొంటోంది. పెద్ద ఎత్తున ఆయుధ సామ‌గ్రిని ర‌ష్యా కోల్పోయింది. తొలి అంకంలోనే ర‌ష్యా యుద్ధ విమానాల‌ను పెద్ద సంఖ్య‌లో ఉక్రెయిన్ సైన్యం కూల్చేసింది. ఉక్రెయిన్లోని వివిధ ప్రాంతాల్లో ఉన్న ర‌ష్యా సైన్యానికి ఆహార ప‌దార్థాల‌ను అందించ‌లేక పోతోంది. కొన్ని ప్రాంతాల్లో ర‌ష్యా సైన్యానికి ఉక్రెయిన్ వాసులు ఆహారం పెట్టిన వీడియోల‌ను కూడా చూశాం. తాజాగా ర‌ష్యా ద‌ళాల‌ను కీవ్ నుంచి వెళ్లిపోయేలా ఉక్రెయిన్ సైన్యం పోరాడింది. ఆ క్ర‌మంలో క్ష‌త‌గాత్రులైన ఉక్రెయిన్ జ‌వాన్లు వివిధ ఆస్ప‌త్రుల్లో చికిత్స పొందుతున్నారు. వాళ్ల‌ను ఉక్రెయిన్ అధ్య‌క్షుడు జెలెన్స్కీ పరామ‌ర్శించాడు. సైనికుల‌తో సెల్ఫ్ ల‌ను తీసుకుని సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేశాడు.

ఉక్రెయిన్ దేశాధ్య‌క్షుడు ఇస్తోన్న ధైర్యం ఆ దేశ సైన్యాన్ని మ‌రింత ధైర్యంగా ముందుకు క‌దుపుతోంది. యుద్ధం రోజుల్లోనే ముగిస్తుంద‌ని భావించిన‌ప్ప‌టికీ ఉక్రెయిన్ సైన్యం సాహ‌సోపేత‌మైన యుద్ధం చేస్తోన్నందున ర‌ష్యా వెనుక‌డుగు వేస్తోంది. యుద్ధ సామాగ్రిని పెద్ద ఎత్తున కోల్పోవ‌డంతో చైనా స‌హాయాన్ని ర‌ష్యా కోర‌డం గ‌మ‌నార్హం. ఉక్రెయిన్ పై యుద్ధం చేయడానికి ఫిబ్ర‌వ‌రి 24న ఆయుధ స‌హాయాన్ని చైనా నుంచి ర‌ష్యా కోరింద‌ని అమెరికా అధికారులు వాషింగ్ట‌న్ పోస్ట్ కు నివేదించింది. “యుఎస్ జాతీయ భద్రతా సలహాదారు జేక్ సుల్లివన్ సోమవారం రోమ్‌లో చైనా యొక్క అగ్ర దౌత్యవేత్త యాంగ్ జీచిని కలవనున్నారు” అని వైట్ హౌస్ ప్ర‌క‌టించింది. ఉక్రెయిన్‌లో “ప్రత్యేక చర్య” అని పిలిచే రష్యా పై పాశ్చాత్యా దేశాల ఒత్తిడి పెరిగింది. రష్యా దాడిని బీజింగ్ ఖండించ‌లేదు. ర‌ష్యా చేస్తోన్న యుద్ధాన్ని దండయాత్ర అని పిలవలేదు, కానీ చర్చల ద్వారా పరిష్కారాన్ని కోరింది. తాజాగా ఏ రకమైన ఆయుధాలను చైనా నుంచి ర‌ష్యా కోరిందో..తెలియ‌డంలేదు. ఆ విష‌యాన్ని చైనా బ‌య‌ట పెడుతుందా? లేదా? అనేది తెలియ‌ద‌ని US అధికారులు వాషింగ్టన్ పోస్ట్ కు తెలప‌డం గ‌మ‌నార్హం.