Site icon HashtagU Telugu

Rupee Value : చరిత్రలో అతి తక్కువ స్థాయికి పడిపోయిన రూపాయి విలువ..?

2c25a36d 2211 4ce7 9576 E777a89894a4

2c25a36d 2211 4ce7 9576 E777a89894a4

ఇండియన్ రూపాయి విలువ నానాటికీ పడిపోతోంది. తాజాగా డాలర్ తో పోలిస్తే రూపాయి మారకం విలువ చరిత్రలోనే అతి తక్కువ స్థాయికి పడిపోయింది. బుధవారం రోజున ఉదయం ఒక డాలర్ కు రూ.78.13 పైసలతో ఫారిన్ ఎక్స్ఛేంజ్ మార్కెట్ ప్రారంభం అయ్యింది. ఈ క్రమంలోనే యూఎస్ డాలర్ తో రూపాయి 27 పైసలు క్షీణించి 78.40 తాత్కాలిక వద్ద సాయి వద్ద ముగిసింది. అయితే విదేశీ పెట్టుబడిదారులు దేశం నుంచి భారీస్థాయిలో సొమ్మును వెనక్కి తీసుకుంటూ ఉండటంతో అ
డాలర్ లకు విపరీతంగా డిమాండ్ పెరిగిందని, అదే రూపాయి పతనానికి కూడా కారణం అయ్యింది అని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు.

ఒక జూన్ నెలలోనే ఇప్పటివరకు దాదాపుగా 38,500 కోట్ల మేర సొమ్మును విదేశీ ఇన్వెస్టర్లు వెనక్కి తీసుకున్నట్లు రిజర్వుబ్యాంకు గణాంకాలు చెబుతున్నాయి. ఇకపోతే ఈ రూపాయి పతనాన్ని అడ్డుకునేందుకు రిజర్వుబ్యాంకు రంగంలోకి దిగినప్పటికీ చారిత్రక కనిష్ఠ స్థాయికి తగ్గడం గమనార్హం. డాలర్లకు డిమాండ్ తో రూపాయి విలువ తగ్గుతుండటంతో దానిని అడ్డుకునేందుకు కొన్ని నెలలుగా రిజర్వు బ్యాంకు తన వద్ద ఉన్న డాలర్ నిల్వలను మార్కెట్లోకి వదులుతున్నప్పటికీ ఫలితం లేకుండా పోయింది అని తెలుస్తోంది.

దేశంలో ఫారిన్ ఎక్స్ఛేంజి నిల్వలు తగ్గుతున్నాయని ఆర్థిక నిపుణులు తెలిపారు. ఒక జూన్ 3 నుంచి 10 మధ్య విదేశీ కరెన్సీ నిల్వలు దాదాపు 459 కోట్ల డాలర్ల మేర తగ్గాయని వెల్లడించారు. అంతర్జాతీయ మార్కెట్ లో క్రూడ్ ధరలు తగ్గుముఖం పట్టడం రూపాయి నష్టాన్ని పరిమితం చేసింది అని వారు తెలిపారు. అయితే దేశీయ యూనిట్ చివరకు గత ముగింపుతో పోలిస్తే 25 పైసలు తగ్గి 78.40 వద్దా రికార్డు స్థాయిలో ముగిసింది. అయితే క్రితం విషయంలో అమెరికా డాలర్తో రూపాయి మారకం విలువ 78.13 వద్ద చేరింది.

Exit mobile version