Rupee Value Declines : పాతాళానికి ప‌డిపోయిన‌ `రూపాయి`

మోడీ సర్కార్ హ‌యాంలో అత్యంత ఘోరంగా భార‌త రూపాయి ప‌త‌నం అయింది.

  • Written By:
  • Updated On - March 7, 2022 / 02:22 PM IST

మోడీ సర్కార్ హ‌యాంలో అత్యంత ఘోరంగా భార‌త రూపాయి ప‌త‌నం అయింది. అంత‌ర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు గణనీయంగా పెరుగుతూ రూపాయి విలువను పాతాళానికి తీసుకెళ్లాయి. ముడి చమురు బ్యారెల్ 129 డాలర్లకు చేర‌డంతో ఫారెక్స్ మార్కెట్లో రూపాయి ప‌త‌నం ప్రారంభం అయింది. జీవిత కాలంలో అత్యంత క‌నిష్టానికి డాలర్ తో పోల్చితే రూపాయి విలువ ప‌డిపోయింది. డాలర్ తో 76.85 వద్ద ట్రేడింగ్ మొదలు కాగా, 76.98 వరకు పడిపోయింది. శుక్రవారం ముగింపు 76.16గా ఉండ‌గా, 81 పైసలకు పైగా నష్టంతో ట్రేడ్ అవుతోంది. క్రితం ట్రేడింగ్ సెషన్ లోనూ రూపాయి 23 పేసలు నష్టపోవడం గమనార్హం.చమురు ధరలు పెరగడంతో దానికి త‌గిన విధంగా డాలర్ బలపడినట్నటు రిలయన్స్ సెక్యూరిటీస్ సీనియర్ రీసెర్చ్ అనలిస్ట్ శ్రీరామ్ అయ్యర్ వివ‌రించాడు. ముడి చమురు ధరలు పెర‌గ‌డంతో భార‌త‌ ఆర్థిక వ్యవస్థపై గణనీయమైన భారం పడుతుంది. డాలర్లకు డిమాండ్ ఏర్పడి రూపాయి విలువ నానాటికీ దిగ‌జారి పోయే ప్ర‌మాదం పొంచి ఉంది.