నెలమారుతుందంటే చాలు అనేక మెరుపులు జరుగుతంటాయి. గ్యాస్ , పెట్రోల్ ధరలు పెరగొచ్చు తగ్గొచ్చు..బ్యాంకు వడ్డీలు పెరగొచ్చు తగ్గొచ్చు..నిత్యావసర ధరలు పెరగొచ్చు తగ్గొచ్చు.. ఇలా అనేక మార్పులు జరుగుతుంటాయి. కాబట్టి ప్రతి ఒక్కరు నెలమారుతుందంటే చాలు కాస్త టెన్షన్ పడుతుంటారు. ఇక ఇప్పుడు మే నెల మరో మూడు రోజుల్లో మారుతుండడంతో జూన్ 1 న ఎలాంటి మార్పులు జరుగుతాయో అని అంత ఎదురుచూస్తున్నారు. ఈ తరుణంలో వాహన దారులకు షాక్ ఇచ్చారు.
జూన్ 1 నుంచి కొత్త ట్రాఫిక్ నిబంధనలు అమల్లోకి రానుండగా, భారీగా జరిమానాలు విధించనున్నారు. అతివేగంతో వాహనం నడుపుతూ పట్టుబడితే రూ.1000 నుంచి రూ.2000వరకు జరిమానా కట్టాల్సి ఉంటుంది. లైసెన్స్ లేకుండా వాహనం నడిపితే రూ.500 జరిమానా వేయనున్నారు. మైనర్ వాహనం నడిపితే రూ.25వేలు ఫైన్ వేస్తారు. దాంతో పాటు మైనర్ కు 25 ఏళ్ల వయసు వచ్చే వరకు డ్రైవింగ్ లైసెన్స్ పొందకుండా ఆంక్షలు విధించనున్నారు. కేవలం ఇవే కాదు మరికొన్ని కూడా మార్పులు కూడా జరగబోతున్నాయి.
We’re now on WhatsApp. Click to Join.
* మీ ఆధార్‌ను అప్‌డేట్ చేయకపోతే.. UIDAI.. ఆధార్ కార్డ్‌ను ఉచితంగా అప్‌డేట్ చేసుకునే తేదీని జూన్ 14 వరకు పొడిగించింది. ఆధార్ కార్డును ఆన్‌లైన్‌లో సులభంగా అప్‌డేట్ చేసుకోవచ్చు. అయితే ఆఫ్‌లైన్‌లో అప్‌డేట్ చేస్తే.. ఆధార్ కేంద్రానికి వెళ్లి ఒక్కో అప్‌డేట్‌కు రూ.50 చొప్పున చెల్లించాల్సి ఉంటుంది.
* వాహనం నడపడం నేర్చుకున్న వారు ప్రైవేట్ ఇన్‌స్టిట్యూట్‌లలో లైసెన్స్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు (కొత్త రూల్ జూన్ 2024లో వర్తిస్తాయి). ఇక్కడ వారి డ్రైవింగ్ టెస్ట్ నిర్వహించుకోవచ్చు. వారికి లైసెన్స్ కూడా జారీ చేయబడుతుంది. గతంలో ఈ పరీక్షలు ఆర్టీఓ ఆధ్వర్యంలో నడిచే ప్రభుత్వ కేంద్రాల్లోనే జరిగేవి. ఈ నియమం జూన్ 1 నుండి వర్తిస్తుంది., అయితే ఈ పరీక్షలు RTO ద్వారా గుర్తింపు పొందిన ప్రైవేట్ ఇన్‌స్టిట్యూట్‌లలో మాత్రమే నిర్వహించబడతాయి. ఈ నిబంధన కూడా జూన్ 1 నుంచి మాత్రమే వర్తిస్తుంది.
Read Also :