ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ ను ఆల్ ఇండియా ఇమామ్ ఆర్గనైజేషన్ హెడ్ ఉమర్ అహ్మద్ ఇల్యాసీ ప్రశంసించారు. రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్‌ఎస్‌ఎస్) చీఫ్ మోహన్ భగవత్ ను ‘రాష్ట్ర పితా’ (జాతి పితామహుడు)గా అభివర్ణంచారు. ముస్లిం నేతలతో మమేకమవుతున్న ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భగవత్ గురువారం ఢిల్లీలోని ప్రముఖ మతపెద్దలను కలిశారు. ఢిల్లీలోని ముస్లిం పెద్దల సమావేశం సందర్భంగా ఉమర్ మాట్లాడారు. “ఈరోజు నా ఆహ్వానం మేరకు మోహన్ భగవత్ జీ వచ్చారు. అతను ‘రాష్ట్ర-పిత’ మరియు ‘రాష్ట్ర-ఋషి’, అతని నుంచి మంచి సందేశం వెళుతుంది. భగవంతుడిని ఆరాధించే మన పద్ధతులు భిన్నంగా ఉంటాయి, కానీ అతిపెద్ద మతం మానవత్వం. దేశం మొదటి స్థానంలో ఉంటుందని మేము నమ్ముతున్నాము, ”అని ఉమర్ అహ్మద్ ఇల్యాసి ఉటంకించడం విశేషం.
RSS Chief Mohan Bhagwat : మోహన్ భగవత్ జాతిపిత: ముస్లిం పెద్ద ఉమర్ ప్రశంస

Mohan Bhagavath