Site icon HashtagU Telugu

Reliance Foundation Scholarships : రిలయన్స్ స్కాలర్‌షిప్స్.. పీజీ విద్యార్థులకు రూ.6 లక్షలు, యూజీ విద్యార్థులకు రూ.2 లక్షలు

Reliance Foundation Scholarships For Ug Students Pg Students

Reliance Foundation Scholarships : గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సులు చదువుతున్న ప్రతిభావంతులైన పేద  విద్యార్థులకు  రిలయన్స్ ఫౌండేషన్ స్కాలర్‌షిప్‌లను(Reliance Foundation Scholarships) అందించనుంది. 2024-25 విద్యా సంవత్సరానికిగానూ ఇందుకోసం 5100 మందిని ఎంపిక చేయనుంది. దీనికి సంబంధించిన వివరాలివీ..

We’re now on WhatsApp. Click to Join

తాజాగా ఈ ఏడాది అందించనున్న 5100 స్కాలర్‌షిప్‌లతో  భారత్​లోనే అతిపెద్ద ప్రైవేట్ స్కాలర్‌షిప్‌ ప్రోగ్రామ్‌గా రిలయన్స్ ఫౌండేషన్ స్కాలర్‌షిప్‌ నిలవనుంది. ఇంజినీరింగ్, టెక్నాలజీ, ఎనర్జీ, లైఫ్ సైన్సెస్‌‌లలో గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సులు చేస్తున్న వారికి ఈ ఉపకారవేతనాలను అందిస్తారు. అండర్ గ్రాడ్యుయేట్ విద్యార్థులకు రూ.2 లక్షలు, పోస్ట్ గ్రాడ్యుయేట్ విద్యార్థులకు  రూ.6 లక్షలు స్కాలర్‌షిప్‌గా అందిస్తారు. ఇప్పటి వరకు రిలయన్స్ దేశవ్యాప్తంగా 23,000 ఉన్నత విద్యా స్కాలర్‌షిప్‌లను అందించింది. ఆర్థిక భారం లేకుండా విద్యార్థులు చదువును కొనసాగించేందుకు ఈ స్కాలర్‌షిప్‌లు ఉపయోగపడనున్నాయి. ఈ స్కాలర్‌షిప్‌కు ఎంపికయ్యే వారికి రిలయన్స్ ఫౌండేషన్ తరఫున మెంటార్ షిప్ సపోర్టును కూడా అందిస్తారు. కెరీర్ గైడెన్ సైతం లభిస్తుంది. వర్క్‌షాప్‌లు, సెమినార్ల ద్వారా వారిలో నాయకత్వ, ప్రొఫెషనల్ నైపుణ్యాలను పెంపొందింపజేస్తారు. సామాజిక సేవ సంబంధిత కార్యక్రమాల్లో పాల్గొనేలా విద్యార్థులను ప్రోత్సహిస్తారు.

Also Read :Manish Sisodia Interview : నా అరెస్టు వెనుక ఏదో రాజకీయ కారణం.. ఇంటర్వ్యూలో మనీశ్ సిసోడియా కీలక వ్యాఖ్యలు

అప్లై చేయడం ఇలా.. 

  • రిలయన్స్ ఫౌండేషన్ స్కాలర్‌షిప్‌ కోసం www.scholarships.reliancefoundation.org వెబ్ సైట్ ద్వారా అప్లై చేయొచ్చు.
  • విద్యార్థి ఆప్టిట్యూడ్, ఆర్థిక నేపథ్యం ఆధారంగా గ్రాడ్యుయేట్ స్కాలర్‌షిప్‌కు ఎంపిక చేస్తారు.
  • అకడమిక్ అచీవ్‌ మెంట్స్, వ్యక్తిగత వివరాలు, ఇంటర్వ్యూ ఆధారంగా పోస్ట్ గ్రాడ్యుయేట్ స్కాలర్‌షిప్‌‌కు ఎంపిక చేస్తారు.
  • ప్రతిభ గల విద్యార్థులను మాత్రమే ఎంపిక చేస్తారు.
  • ఈ స్కాలర్‌షిప్‌‌కు దరఖాస్తు చేసేందుకు లాస్ట్ డేట్ అక్టోబర్ 6.
  • ఏదైనా కోర్సులో మొదటి సంవత్సరం/ సెమిస్టర్ విద్యార్థులు ఈ స్కాలర్‌షిప్‌‌కు అప్లై చేయొచ్చు.
  • రిలయన్స్ ఫౌండేషన్ అధికారిక వెబ్‌సైట్​లో మరింత సమాచారం పొందవచ్చు.