Rs 5 Lakh Per Newborn : ఒక శిశువుకు రూ.5 లక్షల రేటు.. పిల్లలు అమ్మే గ్యాంగ్‌పై సీబీఐ దర్యాప్తు

Rs 5 Lakh Per Newborn : పిల్లల అక్రమ రవాణా వ్యవహారం దేశ రాజధాని ఢిల్లీలో దుమారం రేపుతోంది.

  • Written By:
  • Updated On - April 6, 2024 / 02:05 PM IST

Rs 5 Lakh Per Newborn : పిల్లల అక్రమ రవాణా వ్యవహారం దేశ రాజధాని ఢిల్లీలో దుమారం రేపుతోంది. దీనిపై దర్యాప్తు చేస్తున్న సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో శనివారం దాడులు చేసింది. ఈ రైడ్స్‌లో భాగంగా  దేశ రాజధానిలోని కేశవపురం ప్రాంతంలో ఉన్న ఓ ఇంటి నుంచి ముగ్గురు నవజాత శిశువులను  రక్షించారు. నవజాత శిశువులను బ్లాక్ మార్కెట్‌లో సరుకుల్లాగా కొని అమ్ముతున్నట్లు సీబీఐ వర్గాలు గుర్తించాయి.

We’re now on WhatsApp. Click to Join

గత నెల (మార్చి) లోనే దాదాపు 10 మంది పిల్లలను ఈవిధంగా విక్రయించారని విచారణలో వెల్లడైంది.  ఈ పది మంది పిల్లల్లో దాదాపు  ఏడెనిమిది మంది దేశ రాజధాని ప్రాంతానికి (NCR) చెందినవారని తేలింది. ఈ పిల్లలను అక్రమంగా రవాణా చేసిన ముఠాలోని ఏడుగురు వ్యక్తులను సీబీఐ ఇప్పటికే అరెస్టు చేసింది. పిల్లలను విక్రయించిన మహిళలతో పాటు వారిని కొన్న వ్యవహారంతో ముడిపడిన నిందితులను కూడా అదుపులోకి తీసుకొని సీబీఐ అధికారులు విచారిస్తున్నారు.

Also Read :No Water No Votes : ‘నో వాటర్.. నో ఓట్’.. రాజకీయ పార్టీలకు ఆ గ్రామస్తుల వార్నింగ్

ఓ ఆస్పత్రికి చెందిన వార్డు బాయ్ కూడా ఈ ముఠాలో కీలక పాత్ర పోషించాడని గుర్తించారు.ఈ ముఠాతో లింకులున్న ఇతర రాష్ట్రాలలోని గ్యాంగుల గురించి కూడా సీబీఐ వివరాలను సేకరిస్తోంది. నవజాత శిశువులను దాదాపు రూ. 4 లక్షల నుంచి రూ. 5 లక్షల రేటు(Rs 5 Lakh Per Newborn) విక్రయించారని తెలిసింది. విచారణ కొలిక్కి వచ్చాక మరిన్ని వివరాలు తెలుస్తాయని సీబీఐ వర్గాలు చెబుతున్నాయి.

Also Read : Cantonment Assembly By Elections 2024 : కాంగ్రెస్‌ కంటోన్మెంట్ అభ్యర్థిగా నారాయణ శ్రీగణేష్‌

పిల్లల ఫోన్‌లో ఈ యాప్స్ మస్ట్

ప్రస్తుతం పిల్లలు కూడా స్మార్ట్ ఫోన్‌ తెగ వాడేస్తున్నారు. అనివార్యంగా పిల్లలకు మనం స్మార్ట్‌ఫోన్‌లు ఇవ్వాల్సి వస్తే కచ్చితంగా వారి ఫోన్‌లో కొన్ని రకాల యాప్స్‌ ఉండేలా చూసుకోవాలి. వీటివల్ల మీ పిల్లలు స్మార్ట్‌ఫోన్‌లో ఏం చేస్తున్నారు. ఎలాంటి కంటెంట్ చూస్తున్నారు. ఎలాంటి యాప్స్‌ను ఉపయోగిస్తున్నారు.? లాంటి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు.

  • మీ పిల్లలు చూసే ఫోన్‌లో Google Family Link యాప్‌ ఉండేలా చూసుకోండి. ఈ యాప్‌ సహాయంతో మీ చిన్నారుల వెబ్‌ బ్రౌజింగ్‌ను కంట్రోల్ చేయొచ్చు.
  • Kids Lox అనే యాప్‌ కూడా బాగానే ఉపయోగపడుతుంది. దీంతో మీ పిల్లల ఫోన్‌లో సోషల్ మీడియా యాప్‌లను బ్లాక్ చేయొచ్చు. ఎంపిక చేసిన వెబ్‌సైట్‌లను కూడా బ్లాక్ చేయొచ్చు.
  • నార్టన్‌ ఫ్యామిలీ ప్రీమియర్‌ యాప్‌తో మీ పిల్లల స్మార్ట్ ఫోన్‌ను కంట్రోల్ చేయవచ్చు. ముఖ్యంగా సోషల్‌ మీడియాలో మీ పిల్లలకు ఏవైనా వేధింపులుల వచ్చినా వెంటనే మిమ్మల్ని అలర్ట్‌ చేస్తుంది. ఈ యాప్ సాయంతో చిన్నారుల ఫోన్లలో ప్లే అవుతున్న వీడియోలను కూడా చూడొచ్చు.
  • మీ పిల్లలో ఫోన్‌లో ఉండాల్సి మరో యాప్‌.. Qustodio. దీంతో మీ పిల్లలు ఏ యాప్‌ని ఉపయోగిస్తున్నారు, ఏ యూట్యూబ్ వీడియోను చూస్తున్నారు. ఎలాంటి గేమ్స్ ఆడుతున్నారు? లాంటి అన్నింటినీ ట్రాక్‌ చేయొచ్చు.