గత నెల రోజులుగా ఉల్లిపాయలు (Onion ) కట్ చేయకుండానే కన్నీరు పెట్టిస్తున్న సంగతి తెలిసిందే. నెల క్రితం వరకు కూడా కిలో రూ.10 , 20 లకే వచ్చే ఉల్లిపాయలు..ప్రస్తుతం కిలో రూ. 80 కు చేరింది. దీంతో సామాన్య ప్రజలు ఉల్లి ధరను చూసి కన్నీరు పెట్టుకుంటున్నారు. సాధారణంగా మనం తినే ప్రతి కూరలో ఉల్లిగడ్డ ప్రాధాన్యం ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు. ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయదంటూ సామెతలు కూడా పుట్టుకొచ్చేంతగా మన కూరల్లో ఉల్లి ప్రాధాన్యం ఉంటుంది. అలాంటి ఉల్లి ధర (Onion Price) కొండెక్కి కూర్చువడంతో వాటిని కొనేందుకు సామాన్య ప్రజలు గగ్గోలు పెడుతున్నారు.
We’re now on WhatsApp. Click to Join.
ఈ క్రమంలో కేంద్రం (Centre Government) సామాన్యులకు ఊరట కల్పించే వార్త ప్రకటించింది. బఫర్ స్టాక్ నుంచి రిటైల్ మార్కెట్లలోకి లక్ష టన్నుల ఉల్లిని విడుదల చేయనున్నట్లు కేంద్ర వినియోగదారుల మంత్రిత్వ శాఖ వర్గాలు తెలిపాయి. ఇప్పటికే ఉల్లి ధరలను తగ్గించడం కోసం ఎగుమతులపై ఆంక్షలు విధించింది. దేశవ్యాప్తంగా కిలో ఉల్లిని సబ్సిడీ (Onion Subsidy) కింద కేంద్ర ప్రభుత్వం రూ.25 కే విక్రయిస్తోంది. దీనికి తోడు ఈ నెలలోనే మార్కెట్లలోకి బఫర్ స్టాక్ నుంచి లక్ష టన్నుల ఉల్లిని రిలీజ్ చేయనున్నట్లు కేంద్రం తెలిపింది. ఇక దేశంలోనే అతిపెద్ద ఉల్లి మార్కెట్ అయిన ఢిల్లీలోని ఆజాద్‌పూర్ మండిలో హోల్‌సేల్ కిలో ఉల్లి ధర రూ. 30 కి పడిపోయినట్లు మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. గత వారం ఇక్కడ కిలో ఉల్లి ధర రూ. 60 నుంచి 65 వరకు ఉంది. అసియాలోనే అతిపెద్ద పండ్లు, కూరగాయల మార్కెట్ ఇదే కావడం గమనార్హం. కేంద్రం సబ్సిడీకి ఉల్లిని విక్రయించాలని నిర్ణయించడంతో ధర తగ్గింది. అయితే రానున్న రోజుల్లో దేశవ్యాప్తంగా అన్ని ముఖ్యమైన నగరాల్లో సబ్సిడీ ధరకు ఉల్లిని విక్రయిస్తే ధరలు ఆటోమేటిక్ గా తగ్గుతాయని కేంద్రం అంచనావేస్తోంది.
Read Also : Jr NTR : ఇటుకలఫై జూ. ఎన్టీఆర్ పేరు..ఇది కదా అభిమానం అంటే..