Site icon HashtagU Telugu

Rs 100 Crore : కాంగ్రెస్ ఎంపీ నివాసాల్లో రూ.100 కోట్లు లభ్యం

Rs 100 Crore

Rs 100 Crore

Rs 100 Crore : కోటి కాదు.. రెండు కోట్లు కాదు.. ఏకంగా రూ.100 కోట్లకుపైగా నగదును జార్ఖండ్‌ కాంగ్రెస్‌ రాజ్యసభ ఎంపీ ధీరజ్‌ సాహూ నివాసాల్లో ఆదాయపు పన్ను(ఐటీ) శాఖ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. జార్ఖండ్, ఒడిశా రాష్ట్రాలలోని ధీరజ్ సాహూకు చెందిన నివాసాలు, కార్యాలయాల్లో రెండు రోజుల పాటు జరిపిన సోదాల్లో భారీగా నగదు లభ్యమైంది. ఆ నోట్ల కట్టలను బీరువాలు, డబ్బాలలో పేర్చి ఉంచడాన్ని చూసి.. ఐటీ అధికారులే అవాక్కయ్యారు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. ధీరజ్‌ సాహూ నివాసాల్లో స్వాధీనం చేసుకున్న డబ్బును లెక్కించేందుకు ఏర్పాటు చేసిన మెషీన్ 50 కోట్ల రూపాయల వరకు లెక్కించిన తర్వాత  చెడిపోయింది. కౌంటింగ్ ప్రక్రియను స్పీడప్ చేసేందుకు మరో మూడు యంత్రాలకు ఆర్డర్ చేశారు.

We’re now on WhatsApp. Click to Join.

ఒడిశాలోని బోలంగీర్, సంబల్‌పూర్, జార్ఖండ్‌లోని రాంచీ, లోహర్‌దగాలో జరిపిన తనిఖీల్లో రూ.100 కోట్లకుపైగా డబ్బు లభ్యమైంది.  ఒడిశా, జార్ఖండ్‌‌లలోని బౌద్ డిస్టిలరీస్ ప్రైవేట్ లిమిటెడ్ (బీడీపీఎల్)లో గురువారం 30 మందికిపైగా ఐటీ అధికారులు దాడులు నిర్వహించారు. కచ్చితమైన అధికారిక ధృవీకరణ లేనప్పటికీ.. ధీరజ్ సాహూ నివాసాల నుంచి దాదాపు రూ.200 కోట్ల దాకా దొరికాయని అంటున్నారు.  కరెన్సీని కలిగి ఉన్న సుమారు 150 ప్యాకెట్లు ఇప్పటివరకు బొలంగీర్‌లోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యొక్క హెడ్ బ్రాంచ్‌కు తరలించారు. జార్ఖండ్‌లోని లోహర్దగా ప్రాంతానికి చెందిన ధీరజ్ సాహు 1977లో కాంగ్రెస్‌లో విద్యార్థి నాయకుడిగా తన రాజకీయ జీవితాన్ని(Rs 100 Crore) ప్రారంభించారు.

Also Read: Health Benefits: ప్రతిరోజు ఒక ఉల్లిపాయ తినడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో మీకు తెలుసా?