Railway Jobs : ఇంటర్ పాసైన వారికి మంచి అవకాశం. 3693 నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరీ (ఎన్‌టీపీసీ) పోస్టుల భర్తీకి ఆర్ఆర్బీ నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 3693 పోస్టులలో.. 2022 కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్ పోస్టులు, 990 జూనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ పోస్టులు, 361 అకౌంట్స్ క్లర్క్ కం టైపిస్ట్ పోస్టులు, 72 ట్రెయిన్స్ క్లర్క్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వీటిలో 248 పోస్టులను దివ్యాంగుల కోసం రిజర్వ్ చేశారు. కమర్షియల్ క్లర్క్ కమ్ టికెట్ క్లర్క్ జాబ్స్‌కు ఎంపికయ్యే వారికి ప్రతినెలా రూ.40వేల దాకా పే స్కేల్ చెల్లిస్తారు. మిగిలిన అన్ని పోస్టులకు ప్రతినెలా రూ.36వేల దాకా పే స్కేల్‌ను చెల్లిస్తారు. ఎన్‌టీపీసీలో డిగ్రీ అర్హతతోనూ కొన్ని పోస్టులు ఉన్నాయి. డిగ్రీ చేసిన వారు రెండు రకాల పోస్టులకు(Railway Jobs) కూడా అప్లై చేయొచ్చు. అయితే రెండింటికి రెండు వేర్వేరు రకాల పరీక్షలను నిర్వహిస్తారు. ఈ పరీక్షలను తెలుగు మీడియంలో కూడా రాయొచ్చు.
Also Read :China Vs India : బార్డర్‌లో బరితెగింపు.. పాంగోంగ్ సరస్సు సమీపంలో చైనా నిర్మాణ పనులు
- పైన మనం చెప్పుకున్న రైల్వే పోస్టులకు రెండు దశల్లో కంప్యూటర్ బేస్డ్ టెస్టును నిర్వహిస్తారు. అకౌంట్స్ క్లర్క్, జూనియర్ క్లర్క్ పోస్టులకు టైపింగ్ స్కిల్ టెస్టు కూడా జరుగుతుంది. చివరగా సర్టిఫికెట్ల పరిశీలన, మెడికల్ టెస్టులు నిర్వహిస్తారు.
- స్టేజ్ -1 పరీక్షలో మొత్తం 100 ప్రశ్నలు ఉంటాయి. 90 నిమిషాల్లో పరీక్ష రాయాలి. అర్హత పొందిన వారిని కేటగిరీల వారీగా ఉన్న ఖాళీలకు 15 రెట్ల మందిని స్టేజ్-2కు ఎంపిక చేస్తారు.
- స్టేజ్-2 పరీక్షలో మొత్తం 120 ప్రశ్నలు ఉంటాయి. 90 నిమిషాల్లో పరీక్ష రాయాలి.
Also Read :Lawrence Bishnoi : సబర్మతీ జైలులో లారెన్స్ బిష్ణోయ్.. అతడిని కస్టడీకి ఇవ్వకపోవడానికి కారణమిదే
- స్టేజ్-1, స్టేజ్-2 పరీక్షల్లో అర్హత సాధించడానికి అన్ రిజర్వ్‌డ్, ఈడబ్ల్యూఎస్ కేటగిరీ వారు 40 శాతం మార్కులు, ఓబీసీ ఎన్‌సీఎల్, ఎస్సీ కేటగిరీ వారు 30 శాతం మార్కులు, ఎస్టీ కేటగిరీ వారు 25 శాతం మార్కులు సాధించాలి. దివ్యాంగులకు మార్కులలో అదనంగా మరో 2 శాతం మినహాయింపు ఇస్తారు.
- స్టేజ్-1, స్టేజ్-2 పరీక్షల్లో ప్రతి తప్పు సమాధానానికీ 1/3 మార్కును తగ్గిస్తారు.
- స్టేజ్-2లో ఎంపికయ్యే వారికి టైపింగ్ స్కిల్ టెస్టు నిర్వహిస్తారు. ఇంగ్లీష్‌లో నిమిషానికి 30 పదాలు టైప్ చేయాలి.
- 2025 జనవరి 1 నాటికి 18 నుంచి 33 ఏళ్లలోపు వారు ఈ జాబ్స్‌కు అప్లై చేయొచ్చు. ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు, దివ్యాంగులకు కేటగిరీ ప్రకారం 10 నుంచి 15 ఏళ్లు వయో సడలింపు ఇస్తారు.
- అప్లై చేయడానికి లాస్ట్ డేట్ అక్టోబరు 27.
- మహిళలు, ఎస్సీ, ఎస్టీ, ట్రాన్స్‌జండర్, ఈబీసీలకు అప్లికేషన్ ఫీజు రూ.250. వీరు కంప్యూటర్ టెస్టుకు హాజరైతే బ్యాంకు ఛార్జీలు మినహాయించి, మిగిలిన ఫీజు వెనక్కి చెల్లిస్తారు.
- ఇతర వర్గాల వారికి అప్లికేషన్ ఫీజు రూ.500 ఫీజు. వీరు సీబీటీకి హాజరైతే రూ.400లలో బ్యాంకు ఛార్జీలు మినహాయించి మిగిలినవి వెనక్కి చెల్లిస్తారు.
- పరీక్ష తేదీలను ఇంకా ప్రకటించలేదు.