కొణిజేటి రోశయ్య.. తెలుగు రాష్ట్ర రాజకీయాల్లో ఆయన పేరును తెలియనివారు చాలా అరుదు. ముఖ్యమంత్రిగా, గవర్నర్ గా, ఆర్థికమంత్రిగా, ఎమ్మెల్యేగా వివిధ పదవులను అధిరోహించి.. వాటికే వన్నె తీసుకొచ్చారు. ఆయన కట్టే కాలేవరకు కాంగ్రెస్ పార్టీతోనే ప్రయాణం చేశారు. ముఖ్యంగా అప్పటి వైఎస్ రాజశేఖర్ రెడ్డి తో రోశయ్య చాలా సన్నిహితంగా ఉండేవారు. రాజశేఖరెడ్డి ఏ కార్యక్రమం తలపెట్టినా.. రోశయ్యను సంప్రతించకుండ ఉండలేరు. పేరుకు కాంగ్రెస్ నేత అయినా.. ఆయన అందరికీతో స్నేహంగా, సౌమ్యంగా ఉండేవారు. ప్రతిపక్ష నాయకులతోనూ మంచి సత్ససంబంధాలు కొనసాగించారు. ఏ సమస్య వచ్చినా రోశయ్యను కలవడానికి సంకోచించేవారు కాదు.. రోశయ్య కూడా ప్రతిపక్ష నాయకుల అభ్యర్థలను స్వీకరించి తలలో నాలుకలా ఉండేవారు. అందుకే రోశయ్య అందరివాడు.
ఆయన అందరివాడు.. ప్రముఖులతో రోశయ్య ఫొటోలు!

Roshaiah Final