Site icon HashtagU Telugu

Maha Kumbh Mela 2025: మహా కుంభమేళాలో తొలిసారిగా రోబోలు.. ఏం చేస్తాయి తెలుసా ?

Fire Fighting Robots In Uttar Pradesh Mahakumbh 2025

Maha Kumbh Mela 2025: మన దేశంలో జరిగే ‘మహాకుంభ మేళా’ను ప్రపంచంలోనే అతిపెద్ద తీర్థయాత్రగా  పిలుస్తారు. ఇది వచ్చే సంవత్సరం  జనవరి 13న పౌశ పూర్ణిమా అనే పుణ్య స్నానంతో మొదలవుతుంది.  ఫిబ్రవరి 26 వరకు మహాకుంభ మేళా కొనసాగుతుంది. ఈసందర్భంగా ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌ రాజ్‌లో ఉన్న త్రివేణీ సంగమంలో పుణ్య స్నానాల కోసం అశేష భక్తజనం తరలిరానున్నారు. ఈ పవిత్ర కార్యక్రమం వేళ ఎలాంటి ప్రమాదాలు జరగకుండా ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఇప్పటి నుంచే పలు ఏర్పాట్లు చేస్తోంది.  ఈక్రమంలోనే కుంభేమళాలో(Maha Kumbh Mela 2025) తొలిసారిగా అగ్నిమాపక సేవలను అందించే రోబోలను వినియోగించాలని సీఎం యోగి ఆదిత్యనాథ్ సర్కారు నిర్ణయించింది.

Also Read :Blood Pledge : ‘‘చోరీ చేస్తే సూసైడ్’’.. ఉద్యోగులతో సంతకాలు చేయించుకున్న బ్యాంక్

ఫైర్ ఫైటర్ రోబోలు వేగంగా స్పందించి, అలసిపోకుండా భవనాలపైకి నీళ్లను చిమ్మి మంటలను ఆర్పగలవు. ఈసారి తొలి విడతగా మూడు రోబోటిక్ ఫైర్ ఫైటర్లను ప్రయాగ్ రాజ్‌లో కుంభేమేళా జరిగే పలు ప్రాంతాల్లో మోహరించనున్నారు. ఈ రోబో ఒక్కో దాని బరువు 25 కేజీల దాకా ఉంటుందట. అగ్నిమాపక వాహనాలు పెద్దసైజులో ఉంటాయి. అవి ఇరుకైన ప్రాంతాల్లోకి వెళ్లలేవు. అలాంటప్పుడు ఈజీగా ఫైర్ ఫైటర్ రోబోలను వాడుకోవచ్చు. ఈ రోబోలు మెట్లు కూడా ఎక్కగలవు.

Read :Schedule of Rajya Sabha Seats : ఏపీలో 3 రాజ్యసభ స్థానాలకు షెడ్యూల్ విడుదల

200 మంది అగ్నిమాపక కమాండోలను సైతం ప్రయాగ్ రాజ్‌లోని మహా కుంభమేళా ప్రాంగణంలో సిద్ధంగా ఉంచుతామని అధికార వర్గాలు వెల్లడించాయి. అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడు 35 మీటర్ల ఎత్తు నుంచి నీటిని స్ప్రే చేసే ఆర్టిక్యులేటింగ్‌ వాటర్‌ టవర్‌లను ఏర్పాటు చేశారు. ప్రత్యేక శిక్షణ తీసుకున్న ఎస్‌టీఆర్‌జీ యూనిట్‌ను యూపీ సర్కారు కొత్తగా ఏర్పాటు చేసింది. ఇందులో  ఎన్‌డీఆర్‌ఎఫ్‌, సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (సీఐఎస్‌ఎఫ్) హైదరాబాద్‌లో శిక్షణ పొందిన 200 మంది సిబ్బంది  ఉన్నారు. కుంభమేళా ప్రాంగణంలోని హై రిస్క్‌ జోన్‌లలో వీరిని మోహరించనున్నారు.

Read :Writer Kulasekhar : టాలీవుడ్ ప్రముఖ లిరిక్ రైటర్ కన్నుమూత