కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర విజయవంతంగా ముందుకు సాగుతుంది. ఈ యాత్రలో వేలాది మంది ప్రజలు పాల్గొంటున్నారు. అయితే రాహుల్ చేపట్టిన యాత్రపై ఆయన బావ వ్యాపారవేత్త రాబర్ట్ వాద్రా సంచలన వ్యాఖ్యలు చేశారు. రాహుల్ గాంధీ ‘భారత్ జోడో యాత్ర’లో వేలాది మంది ప్రజలు చేరడం వల్ల దేశంలో మార్పు వస్తుందని వాద్రా అన్నారు. మహారాష్ట్రలోని అహ్మద్‌నగర్ జిల్లాలోని షిర్డీ పట్ణణంలో సాయిబాబా ఆలయంలో ప్రార్థనలు చేసేందుకు వచ్చారు వాద్రా. ఈ సందర్భంగా రాహుల్ గాంధీ ఆలోచన కూడా తాను వివరించనప్పటికీ ఐక్యతను ప్రబోధించిన ఆధ్యాత్మిక నాయకుడు (సాయిబాబా) మాదిరిగానే ఉందన్నారు రాబర్ట్ వాద్రా.
భారత్ జోడో యాత్ర గురించి రాబర్ట్ వాద్రా మాట్లాడుతూ.. రాహుల్ గాంధీ అనేక ప్రాంతాలకు వెళ్లి వేలాది మందిని కలుస్తున్నారు. ప్రజలు పెద్దఎత్తున ఆయనతో కలిసి వస్తున్నారు. రాహుల్ గాంధీ కొత్త ఆశాకిరణంగా భవిష్యత్తులో మార్పు వస్తుంది.” “కేంద్రంలోని బీజేపీ నేతృత్వంలోని ప్రభుత్వం మా వైఫల్యాల గురించి మాట్లాడుతుంది. వారు పార్టీని (కాంగ్రెస్) ఎగతాళి చేస్తున్నారు. కానీ రాహుల్, ప్రియాంక (గాంధీ వాద్రా) వారికి సమాధానం చెబుతారు. ప్రజల్లోనే ఉంటారు. ప్రజల కోసం ఐక్యంగా కృషి చేస్తాం. గాంధీ కుటుంబానికి ప్రజల నుంచి అపారమైన ప్రేమ లభించింది రాబార్ట్ వాద్రా అన్నారు.
Also Read: PK : ప్రశాంత్ కిషోర్ సంచలన వ్యాఖ్యలు..జగన్ కు సాయం చేయకుంటే బాగుండేది..!!
కొత్త ఎన్నికైన కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ప్రజలకు దగ్గరగా ఉంటారు. పార్టీని వీడాలని ఆలోచిస్తున్నవారు వెళ్లాలనుకుంటే వెళ్లిపోవచ్చు. కానీ పార్టీలో ఉన్నవాళ్లు సోనియా గాంధీ త్యాగాన్ని, రాహుల్, ప్రియాంకల కృషిని అర్థం చేసుకుంటారన్నారు. షిర్డిలో పూజలు చాలా సంతోషంగా ఉన్నారు. సాయిబాబా ఏకతా సందేశాన్ని ఇచ్చారు. ప్రస్తుతం దేశం చాలా సంక్షోభంలో ఉంది. రాహుల్ గాంధీ ఆలోచన సాయిబాబా మాదిరిగానే ఉన్నాయి. ఆయనకు సాయిబాబా ఆశీస్సులు లభిస్తాయయని ఆశిస్తున్నాను అని వాద్రా అన్నారు.