Site icon HashtagU Telugu

Delhi : ఢిల్లీలో న్యాయ‌వాది ఇంట్లో చోరికి పాల్ప‌డిన వ్య‌క్తి అరెస్ట్.. భారీగా బంగారం స్వాధీనం

Crime

Crime

ఢిల్లీలోని న్యాయవాది ఇంట్లో చోరీకి పాల్పడిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడి వ‌ద్ద నుంచి రూ. 2 కోట్ల విలువైన నగలు, గాడ్జెట్లు స్వాధీనం చేసుకున్నారు. గ్రేటర్ కైలాష్ IIలోని DLF కింగ్స్ కోర్టులో సీనియర్ న్యాయవాది ఇంట్లో రూ. 2 కోట్ల విలువైన ఆభరణాలు, గాడ్జెట్లు, ఖరీదైన గడియారాలు దొంగ‌త‌నం చేశారు. దీనిపై పోలీసులు కేసు న‌మోదు చేసి ద‌ర్యాప్తు చేయ‌గా ఒక‌ వ్యక్తిని అరెస్టు చేశారు. నిందితుడి వద్ద నుంచి రూ.2 కోట్ల విలువైన గడియారాలు, అత్యాధునిక మొబైల్ ఫోన్లు, బంగారం, వజ్రాలు, పచ్చ ఆభరణాలు, విదేశీ కరెన్సీని కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఢిల్లీ హైకోర్టు సీనియర్ న్యాయవాది అయిన హర్జిత్ సింగ్ తన ఫిర్యాదులో తన మేనల్లుడు అర్ష్ దీప్ సింగ్, పర్దీప్ (కేర్‌టేకర్) తన ఇంటిని తెరిచినప్పుడు.. ఇంట్లో వ‌స్తువులు చెల్లాచెదురుగా ప‌డి ఉండ‌టాన్ని గ‌మ‌నించారు. ఇంట్లో విలువైన వస్తువులు (నగదు, ఆభరణాలు, గడియారాలు, కొత్త మొబైల్ ఫోన్లు) దొంగిలించబడ్డాయని గుర్తించారు. పోలీసులు సీసీటీవీ కెమెరాను స్కాన్ చేసి నిందితుడు ఫిర్యాదుదారుని మాజీ ఉద్యోగి షోయిబే అకా లల్లాగా గుర్తించారు. ఢిల్లీ నుంచి పారిపోయేందుకు ప్రయత్నిస్తుండగా నిందితుడిని పట్టుకున్నారు.