Site icon HashtagU Telugu

Road Accident : ముంబై-పూణె ఎక్స్‌ప్రెస్‌వే బ‌స్సు బోల్తా.. ఇద్ద‌రు మృతి

Mexico Bus Crash

Road accident

ముంబై-పూణె ఎక్స్‌ప్రెస్‌వేపై బ‌స్సు బోల్తా ప‌డింది. ఈ ప్ర‌మాదంలో ఇద్ద‌రు మృతి చెందిన‌ట్లు పోలీసులు తెలిపారు. ఈ బ‌స్సులో 52 మంది విద్యార్థులు ఉన్న‌ట్లు పోలీసులు వెల్ల‌డించారు. ‘వెట్ ఎన్ జాయ్ వాటర్‌పార్క్ & అమ్యూజ్‌మెంట్ పార్క్’ నుంచి చెంబూరుకు తిరిగి వస్తుండగా ఖోపోలి సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో మృతి చెందిన ఇద్దరు విద్యార్థులను హితికా దీపక్ ఖన్నా, రాజ్ మహాత్రేగా గుర్తించారు. బస్సులో ఉన్న మిగ‌తా ప్రయాణికులు గాయపడినట్లు సమాచారం. విద్యార్థులు విహారయాత్ర నుండి తిరిగి వస్తుండగా బస్సు బోల్తా పడిందని సీనియర్ పోలీస్ ఇన్‌స్పెక్టర్ గౌరీ మోర్ పాటిల్ తెలిపారు. ప్రాథమిక సమాచారం ప్రకారం డ్రైవర్ వాహానాన్ని నియంత్రిచ‌డంలో విఫ‌ల‌మైన‌ట్లు పోలీసులు తెలిపారు. స్థానికులు, పోలీసుల సహాయంతో గాయపడిన విద్యార్థులను సమీప ఆసుపత్రికి తరలించారు. కొందరు విద్యార్థులు ఎంజీఎం ఆస్పత్రిలో చేరారు. సౌత్ ముంబైలోని చెంబూర్‌లో మయాంక్ కోచింగ్ క్లాస్‌కు విద్యార్థులు హాజరయ్యారని, వారు ఆదివారం పిక్నిక్ కోసం ఖోపోలీకి వెళ్లారని పోలీసులు తెలిపారు.