Site icon HashtagU Telugu

Bihar : బీహార్ లో ఘోరరోడ్డు ప్రమాదం. ట్రక్కుఢీకొని 12మంది మృతి … మృతుల్లో 8మంది చిన్నారులు..!!

Bihar 1

Bihar 1

బీహార్ లోని వైశాలిలో ఘోర రోడ్డు ప్రమాదంలో జరిగింది. ఆదివారం అర్ధరాత్రి జరిగిన ఈ ప్రమాదంలో మొత్తం 12 మంది మృతి చెందారు… మృతుల్లో చిన్నారులు కూడాన్నారు. వైశాలిలోని దేశర పోలీస్ స్టేషన్ పరిధిలో వేగంగా వచ్చిన లారీ ట్రక్కును ఢీ కొనడంతో ఈ ప్రమాదంలో మరణించింది. ఈ ప్రమాదంలో పలువురు తీవ్రంగా గాయపడినట్లు సమాచారం. ఓ విందుకు హాజరై తిరిగి వస్తున్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. మృతుల్లో చిన్నారులు..మహిళలే ఎక్కువగా ఉన్నారు. ఘటనాస్థలంలో భీకర వాతావరణం ఏర్పడింది.

సమాచారం అందుకున్న పోలీసులు జిల్లా యంత్రాంగానికి సమాచారం అందించారు. ఘటనాస్థలానికి చేరుకుని అంబులెన్స్ లో చిన్నారులను క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. ఆర్జేడీ ఎమ్మెల్యే తెలిపిన వివరాల ప్రకారం…9మంది అక్కడిక్కడే మరణించారు. ముగ్గురు చికిత్స కోసం తరలిస్తుండగా మార్గమధ్యలో మరణించారు. ఈ ఘటనలో 8మంది చిన్నారులు మరణించినట్లు అధికారులు తెలిపారు.

ఈ ఘటనపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము , ప్రధానమంత్రి మోదీ,సీఎం నితీష్ కుమార్ తోపాటు పలువురుప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. ఈ ఘటన బాధాకరమని పీఎంవో ట్వీట్ చేసింది. మరణించిన వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేసింది. బాధిత కుటుంబాలకు రెండు లక్షల ఆర్థికసాయం అందిజేస్తామని ప్రకటించింది.