Nitish – Tejashwi : ఒకే విమానంలో ఢిల్లీకి తేజస్వి, నితీశ్.. ఏం జరగబోతోంది ?

ఇవాళ ఢిల్లీలో ఏం జరగబోతోంది ? నితీశ్ కుమార్.. ఏం చేయబోతున్నారు ?

Published By: HashtagU Telugu Desk
Nitish Tejashwi

Nitish Tejashwi

Nitish – Tejashwi : ఇవాళ ఢిల్లీలో ఏం జరగబోతోంది ? నితీశ్ కుమార్.. ఏం చేయబోతున్నారు ? ఆయన హాజరయ్యేది ఇండియా కూటమి మీటింగ్‌కా ? ఎన్డీయే కూటమి సమావేశానికా ? అనేది కాసేపట్లో తేలిపోనుంది. ఇంత ఉత్కంఠ ఎందుకంటే.. ఇవాళ ఒకే విమానంలో జేడీయూ అధినేత, బిహార్ సీఎం నితీశ్ కుమార్, ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్(Nitish – Tejashwi)  ఒకే విమానంలో ఢిల్లీకి బయలుదేరనున్నారు. ఇండియా, ఎన్డీయే కూటములు పోటాపోటీ సమావేశాలను ఇవాళ నిర్వహిస్తున్న వేళ చోటుచేసుకున్న ఈ పరిణామం సర్వత్రా ఉత్కంఠ రేపుతోంది.

We’re now on WhatsApp. Click to Join

  • ఈ ఎన్నికల్లో ప్రధాని మోడీ సారథ్యంలోని ఎన్డీయే కూటమికి 291 లోక్‌స‌భ సీట్లు వచ్చాయి.
  • కాంగ్రెస్ సారథ్యంలోని ఇండియా కూటమికి 235 సీట్లు వచ్చాయి.
  • కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటుకు ఇండియా కూటమికి మరో 37సీట్లు కావాలి.
  • దీంతో ప్రభుత్వ ఏర్పాటుకు ఇండియా కూటమి కూడా  ప్రయత్నాలు చేస్తోంది.
  • ప్రస్తుతం ఎన్డీయే కూటమిలో ఉన్న పాత దోస్తులతో రహస్య మంతనాలు జరుపుతోంది.
  • ఈక్రమంలోనే ఇవాళ ఇండియా, ఎన్డీయే కూటములు ఢిల్లీ వేదికగా తమ మిత్రపక్షాలతో సమావేశాలు నిర్వహిస్తున్నాయి.

Also Read :Instagram Ads : యూట్యూబ్ బాటలో ఇన్‌స్టా.. యూజర్ల ఓపికకు పరీక్ష

  • ఎన్డీయే కూటమి సమావేశానికి హాజరు కావాలని బిహార్ సీఎం నితీశ్ కుమార్, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు ప్రధాని మోడీ నుంచి ఆహ్వానం అందింది.
  • ఈ ఎన్నికల్లో టీడీపీ 15, జేడీయూ 12 సీట్లు గెలుచుకున్నాయి.
  • టీడీపీ, జేడీయూతో ఇండియా కూటమి దిగ్గజ నేత శరద్ పవార్ మంతనాలు జరిపారని జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి.
  • ఇవాళ ఇండియా కూటమి సమావేశం తర్వాతే తదుపరి వ్యూహాన్ని ప్రకటిస్తామని కాంగ్రెస్‌ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే  మంగళవారం సాయంత్రం తెలిపారు.
  • దీంతో ఇండియా కూటమి ఏం చేయబోతోంది ? అనే దానిపై ఉత్కంఠ నెలకొంది.

Also Read : Heavy Rains: నేడు ఈ రాష్ట్రాల్లో భారీ వ‌ర్షాలు కురిసే అవ‌కాశం..!

  Last Updated: 05 Jun 2024, 10:46 AM IST