Kyrgyzstan : కర్గిస్థాన్‌లో అల్లర్లు..భారతీయ విద్యార్థులు బయటకు రావొద్దుః కేంద్రం అప్రమత్తం

Indian students: కర్గిస్థాన్‌ దేశంలో విదేశీ విద్యార్థులను లక్ష్యంగా చేసుకొని మూక హింస చెలరేగింది. ఈ క్రమంలో భారత ప్రభుత్వం(Government of India) అక్కడ ఉంటున్న భారతీయ విద్యార్థులు(Indian students) అప్రమత్తంగా ఉండాలని కేంద్రం హెచ్చరించింది. ప్రస్తుతం అక్కడి ఆందోళనకర పరిస్థితి దృష్ట్యా భార‌త విద్యార్థులు ఎవ‌రూ బ‌య‌ట‌కు రావొద్ద‌ని తెలిపింది. ఈ మేర‌కు అక్క‌డి భార‌త ఎంబ‌సీ ఎక్స్ (ట్విట‌ర్‌) వేదిక‌గా కీల‌క సూచ‌న చేసింది. We are in touch with our students. […]

Published By: HashtagU Telugu Desk
Riots in Kyrgyzstan..Indian students should not come out; Center alerted

Riots in Kyrgyzstan..Indian students should not come out; Center alerted

Indian students: కర్గిస్థాన్‌ దేశంలో విదేశీ విద్యార్థులను లక్ష్యంగా చేసుకొని మూక హింస చెలరేగింది. ఈ క్రమంలో భారత ప్రభుత్వం(Government of India) అక్కడ ఉంటున్న భారతీయ విద్యార్థులు(Indian students) అప్రమత్తంగా ఉండాలని కేంద్రం హెచ్చరించింది. ప్రస్తుతం అక్కడి ఆందోళనకర పరిస్థితి దృష్ట్యా భార‌త విద్యార్థులు ఎవ‌రూ బ‌య‌ట‌కు రావొద్ద‌ని తెలిపింది. ఈ మేర‌కు అక్క‌డి భార‌త ఎంబ‌సీ ఎక్స్ (ట్విట‌ర్‌) వేదిక‌గా కీల‌క సూచ‌న చేసింది.

కాగా, “మ‌న విద్యార్థుల తాలూకు స‌మాచారాన్ని ఎప్ప‌టిక‌ప్పుడు తెలుసుకుంటున్నాం. ప్ర‌స్తుతానికి ప‌రిస్థితి ప్ర‌శాంతంగానే ఉన్న‌ప్ప‌టికీ, విద్యార్థులు బ‌య‌ట‌కు రావొద్దు. ఏదైనా స‌మ‌స్య ఉంటే వెంట‌నే రాయ‌బార కార్యాల‌యాన్ని(Embassies) సంప్ర‌దించండి” అని ఎంబ‌సీ ట్వీట్ చేసింది. అలాగే 24 గంట‌లు అందుబాటులో ఉండే 0555710041 అనే ఫోన్ నంబ‌ర్ కూడా ఇచ్చింది. ఈ నెల 13న ఈజిప్ట్‌, కిర్గిస్థాన్ విద్యార్థుల మ‌ధ్య జ‌రిగిన ఘ‌ర్ష‌ణ తాలూకు వీడియోలు వైర‌ల్ అయిన నేప‌థ్యంలో విదేశీ విద్యార్థుల‌పై దాడుల‌కు దారితీసిన‌ట్లు రాయ‌బార కార్యాల‌యం పేర్కొంది.

We’re now on WhatsApp. Click to Join.

మరోవైపు కర్గిస్థాన్‌(Kyrgyzstan),ఈజిప్ట్‌(Egypt)కు చెందిన విద్యార్థుల మధ్య మే 13వ తేదీన జరిగిన ఘర్షణకు సంబంధించి వీడియోలు శుక్రవారం వైరల్‌ కావడం దాడులకు దారి తీసింది. అక్కడ భారత్‌, బంగ్లాదేశ్‌, పాకిస్థాన్‌ విద్యార్థులు నివసించే బిష్కెక్‌లోని కొన్ని వైద్య విశ్వవిద్యాలయాల హాస్టళ్లపై దాడి జరిగింది. ఈ దాడిలో పాకిస్థాన్‌కు చెందిన పలువురు విద్యార్థులు ప్రాణాలు కోల్పోయినట్లు స్థానిక మీడియా నివేదించింది. మరికొంతమంది గాయాలపాలైనట్లు తెలిపింది.

Read Also: TS EAMCET Result 2024: ఎప్‌సెట్‌ ఫలితాలు విడుద‌ల‌.. చెక్ చేసుకోండిలా..?

అంతేకాక దాడుల నేపథ్యంలో పాకిస్థాన్‌ (Pakistan) ప్రభుత్వం కూడా అప్రమత్తమైంది. అక్కడి పాక్‌ విద్యార్థులు(Pakistani students) అప్రమత్తంగా ఉండాలని, బయటకు రావొద్దంటూ సూచించింది. బిష్కెక్‌లోని కొన్ని వైద్య విశ్వవిద్యాలయాల హాస్టళ్లు, పాకిస్థానీలతో సహా విదేశీ విద్యార్థుల ప్రైవేట్‌ నివాసాలపై దాడులు జరిగినట్లు తెలిపింది. అయితే, ఈ దాడిలో పాక్‌కు చెందిన విద్యార్థుల మరణాలు, గాయాలపై నివేదికలు వచ్చినప్పటికీ తమకు ఇప్పటి వరకూ ఎలాంటి సమాచారం అందలేదని తెలిపింది. పరిస్థితి సాధారణ స్థితికి వచ్చే వరకూ విద్యార్థులు ఎవరూ బయటకు రావొద్దని పాక్‌ రాయబార కార్యాలయం తెలిపింది.

  Last Updated: 18 May 2024, 12:00 PM IST