Site icon HashtagU Telugu

Right to Dignity : వ్య‌భిచారుల‌కు గుర్తింపు కార్డులు

వ్య‌భిచారుల‌కు గుర్తింపు కార్డులు ఇవ్వాల‌ని కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాల‌కు సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చేసింది. వాళ్ల‌కు సంబంధించిన గుర్తింపు కార్డుల గురించి 2011లో ఇచ్చిన ఉత్త‌ర్వుల‌ను ప్రభుత్వాలు ఎందుకు అమ‌లు చేయలేద‌ని ప్ర‌శ్నించింది. వృత్తితో సంబంధం లేకుండా ప్ర‌తి పౌరుడికి ప్రాథ‌మిక హ‌క్కులు క‌ల్పించాల‌ని ప్ర‌భుత్వాలను ఆదేశించింది.సెక్స్ వర్కర్లకు ఆధార్ , రేష‌న్‌, ఓటరు కార్డులను వెంటనే జారీ చేయాల‌ని కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాలు మరియు కేంద్ర పాలిత ప్రాంతాలను సుప్రీంకోర్టు ఆదేశించింది. COVID-19 కారణంగా సెక్స్ వర్కర్లు ఎదుర్కొంటున్న పేదరికాన్ని ఎత్తిచూపిన NGO ‘దర్బార్ మహిళా సమన్వయ కమిటీ’ దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీం కోర్టు విచారించింది. భారతదేశం అంతటా తొమ్మిది లక్షల మంది మహిళలు, లింగమార్పిడి సెక్స్ వర్కర్లకు ఉపశమన చర్యలను కోరుతూ దాఖ‌లు చేసిన పిటిష‌న్ పై సుప్రీం కోర్టు విచార‌ణ చేసింది. జాతీయ AIDS నియంత్రణ సంస్థ లేదా NACO మరియు రాష్ట్ర AIDS నియంత్రణ సంఘాలు కమ్యూనిటీ-ఆధారిత సంస్థలు అందించిన సమాచారాన్ని ధృవీకరించిన తర్వాత సెక్స్ వర్కర్ల జాబితాలను సిద్ధం చేసే ప్రక్రియలో ఉన్నాయ‌ని ప్ర‌భుత్వం తెలియ‌చేసింది. స్టేటస్ రిపోర్ట్ ను నాలుగు వారాల వ్యవధిలో దాఖలు చేయాల‌ని సుప్రీం ఆదేశించింది. ఆ లోగా రాష్ట్ర ప్రభుత్వాలు, యుటిలు రేషన్ పంపిణీని కొనసాగించాలని ఆదేశించారు. అవసరమైన చర్యల కోసం ఆర్డర్ కాపీని రాష్ట్ర మరియు జిల్లా న్యాయ సేవల అధికారులకు పంపాలని పేర్కొంది. వివిధ ID కార్డులను సిద్ధం చేసేటప్పుడు సెక్స్ వర్కర్ పేర్లు వాళ్ల గుర్తింపును గోప్యంగా ఉంచాలని ప్రభుత్వాన్ని సుప్రీం కోరింది.

Exit mobile version