Indian National Anthem : బ్రిటీష్ గడ్డపై మారుమోగిన భారత జాతీయ గీతం

బ్రిటన్‌ గడ్డపై 'జనగణమన వినిపిస్తే ఆ ఉద్వేగం గురించి మాటల్లో చెప్పలేం

Published By: HashtagU Telugu Desk
Ricky Kej recreates Indian National Anthem with the largest orchestra in UK

Ricky Kej recreates Indian National Anthem with the largest orchestra in UK

200 ఏళ్ల పాటు భారతదేశాన్ని పాలించిన బ్రిటిష్ తెల్లదొరల గడ్డ ఫై భారత జాతీయ గీతం (Indian National Anthem) మారుమోగింది. భారత జాతీయ గీతం ఎక్కడ విన్న భారతీయుల్లో ఏదో తెలియని భావం కలుగుతుంది. వ్యాపారం కోసం భారత దేశంలో అడుగుపెట్టిన బ్రిటిష్ తెల్లదొరలు..ఆ తర్వాత మన పైనే పెత్తనం చెలాయించారు. సుమారు 200 ఏళ్ల పాటు వారి చేతిలో భారతీయులు బందీలుగా ఉన్నారు. ఆ తర్వాత ఆ తెల్లదొరలను తరమికొట్టి స్వాతంత్ర్యాన్ని సాధించుకున్నాం.

అలాంటి తెల్లదొరల గడ్డపై ఇప్పుడు మన జాతీయ గీతం మారుమోగింది. 100మంది సంగీత కళాకారులు భారత జాతీయ గీతం ‘జనగణమన’ను ఆలపించారు. బ్రిటన్‌ గడ్డపై ‘జనగణమన వినిపిస్తే ఆ ఉద్వేగం గురించి మాటల్లో చెప్పలేం. భారతీయ స్వరకర్త, మూడు సార్లు ‘గ్రామీ అవార్డు’ విజేత రికీ కేజ్‌ (Ricky Kej). 77వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఈ ‘జనగణమన’ వీడియోను ట్విటర్‌ వేదికగా విడుదల చేశారు.

ఈ సందర్భంగా రికీ కేజ్ భావేద్వేగం చెందుతు ”లండన్‌లోని పేరుపొందిన ‘అబే రోడ్‌ స్టూడియోస్‌'( London Abbey Road Studios)లో ‘ది రాయల్‌ ఫిల్హార్మోనిక్‌ ఆర్కెస్ట్రా'(Royal Philharmonic Orchestra)కు చెందిన 100 మంది కళాకారుల బృందంతో జనగణమన గీతాన్ని రికార్డు చేశాను. భారత జాతీయ గీతాన్ని రికార్డ్‌ చేసిన అతిపెద్ద ఆర్కెస్ట్రా ఇదే. చాలా అద్భుతంగా వచ్చింది. గీతం చివర్లో నా రోమాలు నిక్కబొడుచుకున్నాయి. భారతీయ స్వరకర్తగా గొప్ప అనుభూతిని పొందా” అని తెలిపారు.

Read Also : Google Doodle : ఆగస్టు 15 వేళ ఈ డూడుల్ తో గూగుల్ శుభాకాంక్షలు చెప్పింది

  Last Updated: 15 Aug 2023, 12:15 PM IST