రిక్షావాలాకు షాక్‌.. 3 కోట్లు ఫైన్ క‌ట్టాల‌నంటూ ఐటీశాఖ నోటీసు

మీరు చ‌ద‌విన హెడ్‌లైన్ నిజ‌మే. రిక్షావాల‌కే.. నోటీసులిచ్చింది భార‌త ఇన్‌కంటాక్స్ శాఖ‌నే. అది కూడా ఏకంగా మూడుకోట్లు ఫైన్ క‌ట్టాల‌ని.

  • Written By:
  • Publish Date - October 25, 2021 / 11:13 AM IST

మ‌న‌దేశంలో ఇలాంటి విచిత్ర‌మైన ఘ‌ట‌న‌లు కొత్తేమీ కాదు..అస‌లు క‌రెంట్ క‌నెక్ష‌న్ లేని వాడికి లక్ష‌ల్లో బిల్లులు, న‌ల్లా లేనోడికి వేల‌ల్లో బిల్లులు వ‌స్తున్న చోట రిక్షావాలాకు ఐటీ శాఖ నోటీసులు రావ‌డం అంత ఆశ్చ‌ర్యం క‌లిగించ‌క‌పోవ‌చ్చు. కానీ.. అస‌లు క‌ధేంటో తెలుసుకోవాలిగా.. చ‌ద‌వండి మ‌రి..

అది యూపీలోని మ‌ధుర జిల్లా. ఒక రిక్షావాలా హ‌డావుడిగా పోలీస్‌ స్టేష‌న్ ద‌గ్గ‌రికి వెళ్లి ఆగాడు. సీఐ గారి ద‌గ్గ‌రికెళ్లి నా కంప్ల‌యింట్ తీసుకోమ‌ని అడిగితే ఆ పేప‌ర్ చ‌దివిన స‌దురు సీఐ గారు షాక్ అయ్యారు. ఎందుకంటే అది ఐటీ శాఖ నోటీసు తాలూకు కంప్ల‌యింట్‌. ఏకంగా మూడు కోట్ల రూపాయ‌ల డ్యూ ఉన్నావంటూ ఆ రిక్షావాలాకు మ‌న భార‌త ఐటీ శాఖ నోటీసులిచ్చింది.

స్ధానికంగా అమ‌ర్‌కాల‌నీలో నివాస‌ముండే ప్ర‌తాప్‌సింగ్ రిక్షా తోలుతూ జీవితం గ‌డుపుతున్నాడు. ఒక్క‌సారిగా మూడుకోట్ల రూపాయ‌ల‌కు ఐటీ నోటీసులు రావ‌డంతో భ‌య‌ప‌డిపోయిన ప్ర‌తాప్‌.. హైవే పోలీస్‌స్టేష‌న్‌లో కంప్ల‌యింట్ ఇచ్చాడు. అయితే,దీనిపై కేసు న‌మోదు చేయ‌లేదు కానీ.. అస‌లు విష‌య‌మేంటో క‌నుక్కుంటామ‌ని చెప్పారు పోలీసులు. దీంతో.,, అస‌లు ఏం జ‌రిగిందో వివ‌రిస్తూ ఓ వీడియో క్లిప్‌ను సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేశాడు ప్ర‌తాప్‌సింగ్‌.

త‌న బ్యాంక్ అకౌంట్ బ్లాక్ అవ‌డంతో మార్చ్ 15 వ తారీఖున బ‌క‌ల్‌పూర్‌లోని జ‌న్‌సువిధ కేంద్ర‌లో పాన్‌కార్డు అప్ల‌య్ చేశాడ‌ట‌. అయితే, అక్క‌డ డేటా ఎంట్రీలో జ‌రిగిన పొర‌పాటుతో అక్టోబ‌ర్ 19న 3 ల‌క్ష‌ల 47వేల 896 రూపాయ‌ల ఫైన్ క‌ట్టాలంటూ త‌న‌కు ఐటీ శాఖ నోటీసులు ఇచ్చిన‌ట్టు చెప్పాడు ప్ర‌తాప్‌. అస‌లు విష‌య‌మేమిటంటే త‌న పాన్‌కార్డును వినియోగించి వేరెవ‌రో త‌మ కంపెనీ పేరుమీద జీఎస్‌టీకి అప్ల‌య్ చేసిన‌ట్టు.. ఆ కార‌ణంగానే త‌న‌కు నోటీసు వ‌చ్చిన‌ట్టు గుర్తించారు.