Woman DNA Mystery : కొన్ని నెలల క్రితం పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్‌కతాలో ఉన్న ఆర్జీ కర్ మెడికల్ కాలేజీలో జూనియర్ వైద్యురాలిపై జరిగిన హత్యాచార ఘటన కలకలం రేపింది. ఈ కేసులో దోషి సంజయ్ రాయ్ అని తేలింది. దీంతో కోర్టు అతడికి జీవిత ఖైదు శిక్షను విధించింది. అయితే ఈ కేసు దర్యాప్తులో గుర్తించిన ఓ కీలకమైన విషయం ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. అదే.. ఒక మహిళ డీఎన్ఏ.
Also Read :Maoist Chalapathi : మావోయిస్ట్ కేంద్ర కమిటీ సభ్యుడు చలపతి ఎన్‌కౌంటర్.. ఆయన నేపథ్యం ఇదీ
సీఎఫ్ఎల్ రిపోర్టులో కీలక అంశాలు..
ఆ దురాగతానికి బలైన జూనియర్ వైద్యురాలి డెడ్‌బాడీపై సెంట్రల్ ఫోరెన్సిక్ లాబొరేటరీ (సీఎఫ్ఎల్) కోర్టుకు సమగ్ర నివేదికను సమర్పించింది. జూనియర్ వైద్యురాలి శరీరంపై ఒక మహిళ డీఎన్ఏ కూడా ఉందని గుర్తించామని అందులో సీఎఫ్ఎల్ స్పష్టంగా ప్రస్తావించింది. హత్యాచారానికి గురైన జూనియర్ వైద్యురాలి శరీరంపై సంజయ్ రాయ్ డీఎన్ఏ(Woman DNA Mystery) దొరికింది. అదేవిధంగా అతికొద్ది స్థాయిలో ఓ మహిళ డీఎన్ఏ కూడా అక్కడ బయటపడిందని సీఎఫ్ఎల్ పేర్కొంది. దీంతో ఈ కేసులో కొన్ని కొత్త ప్రశ్నలు ఉదయిస్తున్నారు. మరో మహిళ డీఎన్ఏ పొరపాటున సంజయ్ రాయ్ డీఎన్‌ఏతో కలిసిందా ? మరో మహిళ కూడా ఈ నేరంలో భాగంగా మారిందా ? అనే ప్రశ్నలకు సమాధానం దొరకాల్సి ఉంది. జూనియర్ వైద్యురాలి తండ్రి గతంలో చేసిన పలు ఆరోపణలు కూడా ఈ ప్రశ్నలకు ఊతం ఇచ్చేలాగే ఉన్నాయి.
Also Read :Vivek Ramaswamy : ట్రంప్ ‘డోజ్’ నుంచి వివేక్ ఔట్.. పెద్ద స్కెచ్‌తోనే ?
జూనియర్ వైద్యురాలి తండ్రి వ్యాఖ్యలలో..
‘‘నా కూతురి గొంతుపై గాయాలు ఉండటాన్ని అందరూ చూశారు. అయినా ఆమె గొంతు నుంచి స్వాబ్ సేకరించలేదు. నా కూతురి హత్యలో నలుగురు పురుషులు, ఇద్దరు మహిళల పాత్ర ఉందని డీఎన్‌ఏ రిపోర్టులో వెల్లడైంది. ఈవిషయాన్ని కొందరు అధికారులు నాకు చెప్పారు’’ అని అప్పట్లో జూనియర్ వైద్యురాలి తండ్రి వ్యాఖ్యలు చేశారు. అంటే.. మిగతా దోషులను రక్షించారా? అనే ప్రశ్న ఉదయిస్తోంది. ఇక తనకు కోర్టు శిక్షను ఖరారు చేయడానికి ముందు సంజయ్ రాయ్ కీలక కామెంట్స్ చేశాడు. ‘‘నేను ఏ నేరం చేయలేదు. ఏ కారణం లేకుండానే నన్ను ఇందులో ఇరికించారు’’ అని అతడు చెప్పుకొచ్చాడు.